అదానీ 'స్టోరీ ఆఫ్ సూరజ్'.. భారత్ సౌర శక్తి వినియోగంపై గ్లింప్స్..
సౌర శక్తి వినియోగం.. ప్రజల రోజూవారీ జీవనశైలిలో సోలార్ ఎనర్జీ పాత్రను వివరిస్తూ అదానీ సంస్థ 'స్టోరీ ఆఫ్ సూరజ్' అనే పేరుతో మూడో మూవీని ఘనంగా ప్రారంభించింది. #HumKarkeDikhateHain సిరీస్ లో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రజల్లో సోలార్ ఎనర్జీ ఉపయోగం వివరిస్తూ.. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ పాత్రను వివరిస్తోంది.అంతేకాక క్లీన్ ఎనర్జీ వినియోగంలో స్థిరమైన పురోగతిని సాధించాలనే గ్రూప్ లక్ష్యాన్ని ఈ చిత్రం నొక్కి చెబుతుంది.
'స్టోరీ ఆఫ్ సూరజ్' చిత్రం ఓ టౌన్ లో సాగుతుంది. ఆ నగరంలో నిరంతరం సోలార్ ఎనర్జీ వినియోగం సాగుతుంది. ఈ మూవీలో అదానీ గ్రూప్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో వివరించనుంది. అదానీ సౌరశక్తి పరిష్కారాల ద్వారా ఒక పట్టణం సరికొత్తగా ఎలా రూపాంతరం చెందిందనేది వివరిస్తుంది.
ఈ చిత్రంలో రాకేష్ అనే యువకుడు చాలా సంవత్సరాల తర్వాత తన స్వస్థలానికి తిరిగొస్తాడు. అయితే ఆ గ్రామంలో నిరంతరాయంగా సౌరశక్తి ప్రవహిస్తూ.. ప్రజలు ఈ సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటూ ఉంటారు. గ్రామంలో వచ్చిన అద్భుత మార్పులు, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయం, డిజిటల్ పాఠశాలలు, ఆసుపత్రులు, జీవనోపాధి.. తదితర మార్పులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు.
ఈ చిత్రానికి 'బధాయి హో' సినిమా దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అదానీ క్లీన్ ఎనర్జీ మిషన్ ను చక్కగా తెరకెక్కించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక శక్తి సంస్థ. భారత్ క్లీన్ ఎనర్జీ మిషన్ లో అదానీ కీలక పాత్ర పోషిస్తోంది.

అదానీ గ్రూప్ కార్పొరేట్ బ్రాండింగ్ హెడ్ అజయ్ కాకర్ ప్రాజెక్ట్ పై మాట్లాడారు. అదానీ సంస్థలో తాము కేవలం విద్యుత్ ను ఉత్పత్తి చేయడమే కాదు.. పురోగతికి మార్గాలను సృష్టిస్తున్నామని. 'స్టోరీ ఆఫ్ సూరజ్'లో ఒక పట్టణంలో పరివర్తన దేశవ్యాప్తంగా తాము చేస్తున్న మార్పునకు ప్రతీక అని తెలిపారు.
"అదానీ సంస్థ.. కొత్త సౌరశక్తి చిత్రంతో సాంకేతికతకు ఇంకొక మానవ స్పర్శను జోడించింది" అని ఓగిల్వీ ఇండియా చీఫ్ అడ్వైసర్ పీయూష్ పాండే తెలిపారు. "స్టోరీ ఆఫ్ సూరజ్ సౌరశక్తి ఎలా సమాజంలోని ప్రజల జీవితాన్ని మార్చే అవకాశాలను కల్పిస్తుంది. వారికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడుతుంది." అని వివరించారు అని పీయూష్ పాండే తెలిపారు.
ఈ మూవీ #AdaniHKKDH సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ చాప్టర్. ఈ మూవీ అన్ని ప్రముఖ ప్లాట్ ఫారమ్ లోకి రానుంది. బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ మీడియా, రేడియోలోనూ ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications