Adipurush సినిమా మూడ్రోజుల ముచ్చటేనా..గ్రాఫిక్స్‌తో గబ్బు చేశారా..?
బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో డిజాస్టర్ ఇచ్చిన ప్రభాస్. తాజాగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 16వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి షోలు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇది కేవలం ఫ్యాన్స్ ఇచ్చిన టాక్ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేమని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే క్రమంగా షోలు పెరగడంతో న్యూట్రల్ ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అసలు ఆదిపురుష్ చిత్రం ఎలా ఉంది..?
ప్రభాస్ కృతి సనన్, సైఫలీఖాన్‌లు నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ చిత్రం పై మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ, అన్నిటినీ అధిగమించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ భారీ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్‌కు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందానికి రుచించడం లేదు. సోషల్ మీడియాలో పాజిటివిటీ కంటే ఎక్కువగా మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బయటకు చెప్పుకోనప్పటికీ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Watch this edit 🥵💥🙌🏻 pic.twitter.com/2YZLQ5wcAa
— King👑 (@mdimtiazali703) June 16, 2023
ఇక ఆదిపురుష్ చిత్రంకు సంబంధించి ట్రోలింగ్స్ మామూలుగా నడవడం లేదు. ఒక వర్గం ప్రేక్షకులు సినిమా అదుర్స్ అని చెబుతుండగా మరో వర్గం ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ రాముడి గెటప్‌కు సెట్ కాలేదని చెప్పుకొచ్చారు. ఇక గ్రాఫిక్స్‌తో ఏదో చేయబోయి మరేదో చేశారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గ్రాఫిక్స్‌తో గబ్బు చేశారంటూ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక స్క్రిప్ట్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.
I think Ram Charan sir looks far better as Prabhu Shree Ram than Drunken Prabhas . Prabhas Fans this is hard to digest but it's true.#Adhipurush #AdipurushReview #Prabhas #Prabhas𓃵 #AdipurushWithFamily #AdipurushTickets #KritiSanon #Adipurush #SaifAliKhan pic.twitter.com/eXQ38Yen4k
— Cricket Vibes (@Cricket_Vibe1) June 16, 2023
రాంచరణ్ లుక్ అదుర్స్ : ఇక రావణుడి పాత్రలో కనిపించిన సైఫలీఖాన్ పై ఇంటర్నెట్‌లో మీమ్స్ పేలుతున్నాయి. రావణుడిలా కాకుండా ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకునేందుకు వచ్చినవాడిలా ఉన్నాడంటూ విమర్శించారు.ఇక ఆదిపురుష్ చిత్రం మరో అవతార్‌లా అనిపించిందని మరొకరు పోస్టు చేశారు. కార్టూన్ సినిమాకు ఇన్ని కోట్లు ఖర్చా..? అంటూ మరొకరు ప్రశ్నించారు. మరికొందరు ప్రభాస్ లుక్‌ను రాంచరణ్‌తో పోలుస్తూ.. చరణ్ ప్రభాస్ కంటే చాలా బాగున్నాడంటూ ట్వీట్ చేశారు.
#AdipurushReview
— OSCAR💸 (@theoscar_25) June 16, 2023
WORST movie
Is this the way you handle a 1800crs club actor @omraut ? 🤬😭
As a Prabhas fan, I do NOT encourage such cringe films.
I request all darlings to stop encouraging Prabhas for such shit.#Adipirush #AdipurushDisaster#Prabhas #SaifAliKhan pic.twitter.com/3E7u3wcHhi
ఇక టీజర్, ట్రైలర్ విడుదల నుంచి ఆదిపురుష్ చిత్రం ఒక కార్టూన్ సినిమాలా అనిపిస్తోందనే విమర్శలు వినిపించాయి.దీంతో చిత్ర బృందం కొన్ని కరెక్షన్స్ చేసింది. ఇక విడుదలయ్యాక కూడా కార్టూన్ సినిమా ఫీలింగే కలిగిందని కొందరు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications