Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిబిడాశ్చర్యం: కట్టిపడేసిన ఎయిర్ షో- ప్రధాని మోదీ సైతం..!!

బెంగళూరులో అయిదు రోజుల పాటు జరిగే ఎయిరో ఇండియా 2023ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీ బెంగళూరు- ఎయిర్ షో కోసం సన్నద్ధమైంది. బెంగళూరు శివార్లలోని యలహంకలో వైమానిక దళానికి చెందిన ఎయిర్ పోర్ట్ వేదికగా ఈ షో ఆరంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ షోను ప్రారంభించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇందులో పాల్గొన్నారు.

'ది రన్‌అవే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్' అనేది ఈ ఏడాది ఎయిర్ షో థీమ్‌. ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే ఎయిర్ షో ఇది. 1996 నుంచి ఇప్పటివరకు 13 సార్లు దీనికి బెంగళూరు ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇది 14వది. ఈ ఎయిర్ షోలో అమెరికా కూడా పాల్గొనబోతోంది. ఇప్పటికే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం బెంగళూరుకు చేరింది. భారత్ లోని అమెరికా ఛార్జ్ డీ అఫైర్స్ ఎలిజబెత్ జోన్స్ దీనికి సారథ్యాన్ని వహిస్తోన్నారు.

PM Modi

అమెరికాతో పాటు మొత్తం 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటోండటం విశేషం. భారత్‌లో తయారైన జెట్ ఫైటర్స్, అత్యాధునిక యుద్ధ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్‌ ప్రచండ్‌ అందరినీ ఆకర్షించాయి. పైలెట్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ ఎయిర్‌షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దేశ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో- తమ ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఎయిర్‌ బస్‌, బోయింగ్‌, లాక్ హీడ్ మార్టిన్‌, ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, భారత్ డైనమిక్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వంటి సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి.

PM Modi

ఈ ఎయిర్ షోను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ విమానాల విన్యాసాలను ప్రధాని తిలకించారు. ఆత్మనిర్భర్ భారత్ కు ఇది అద్దంపట్టిందని వ్యాఖ్యానించారు. ఆకాశమే హద్దుగా నవభారత్ నిర్మితమౌతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రక్షణ తయారీ రంగంలో ఉన్న అతిపెద్ద కంపెనీలకు భారత్ ప్రధాన మార్కెట్ నిలిచిందని అన్నారు. మున్ముందు మరిన్ని అద్భుతాలను రక్షణరంగంలో చూడగలమని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+