విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని కాబూల్ నుంచి ఢిల్లీకి.. 13 ఏళ్ల అఫ్గాన్ బాలుడి సాహసం!
ఏవియేషన్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తున్న ఓ అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఊహకందని సాహసంతో 13 ఏళ్ల అఫ్గానిస్తాన్ బాలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక 13 ఏళ్ల బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీకి రెండు గంటల పాటు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు. 2 గంటలపాటు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణించి సురక్షితంగా కిందకు దిగడం అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది.
అఫ్గానిస్తాన్‌లోని కందూజ్ నగరానికి చెందిన ఈ బాలుడు కాబూల్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కేఏఎం ఎయిర్‌లైన్స్ విమానం వద్దకు చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా విమానం టైర్ల మీదుగా ఎక్కి, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడు. అయితే సాధారణంగా ఇలాంటి ప్రయాణాల్లో 80 శాతం మంది ప్రాణాలు కోల్పోతారు. కానీ ఈ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండింగ్ అయిన అనంతరం బాలుడు కిందకు దిగి విమానాశ్రయం పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గమనించారు. ఆ బాలుడిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం సరదా కోసం మాత్రమే సాహసం చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేశానని.. ఆ బాలుడు చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమై సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. బాలుడు దాక్కున్న ప్రదేశంలో ఎరుపు రంగులో ఉన్న ఓ చిన్న స్పీకర్ తప్ప మరేమీ లభించలేదు. ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదన నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతించారు. అదే రోజు రాత్రి మళ్లీ ఆ బాలుడిని విమానంలో తిరిగి కాబూల్ కు పంపారు.
మృత్యు నిలయం.. ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్
విమానంలో ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఇది కేవలం భారీ చక్రాలు, హైడ్రాలిక్ స్ట్రట్‌లు, ఇతర మెకానిజమ్‌లను ఉంచడానికి మాత్రమే రూపొందించబడింది. ఇందులో దాక్కునే వ్యక్తులు అనేక ప్రమాదాలను ఎదుర్కొంటారు: విమానం 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు, కంపార్ట్‌మెంట్‌లో ఉష్ణోగ్రత -40°C నుండి -60°C వరకు పడిపోతుంది. అంతేకాకుండా, ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో హైపోక్సియా కారణంగా లోపల ఉన్నవారు కొన్ని నిమిషాల్లోనే స్పృహ కోల్పోయి చనిపోయే అవకాశం ఉంది. టేకాఫ్ తర్వాత ల్యాండింగ్ గేర్ లోపలికి ముడుచుకునేటప్పుడు, భారీ చక్రాలు, ఇతర యంత్రభాగాలు లోపలికి ఫోల్డ్ అవుతాయి. దీనివల్ల లోపల ఉన్న వారికి ఏ మాత్రం చోటు ఉండదు. విమానం ల్యాండింగ్ సమయంలో గేర్ డోర్లు తిరిగి తెరుచుకుంటాయి. ఈ క్రమంలో లోపల ఉన్నవారు వందల మీటర్ల ఎత్తు నుంచి రన్‌వేపై పడిపోయే ప్రమాదం ఉంది.
ఆ బాలుడు ఎలా బ్రతికాడు?
ఈ తీవ్రమైన ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ ఆ బాలుడు బ్రతకడానికి కారణం కొన్ని అసాధారణ అంశాలు అని నిపుణులు విశ్లేషించారు. కాబూల్ నుంచి ఢిల్లీ ప్రయాణం కేవలం రెండు గంటలు మాత్రమే. ఇది సాధారణ అంతర్జాతీయ విమానాల కంటే చాలా తక్కువ. దీనివల్ల బాలుడు ఎక్కువసేపు తీవ్రమైన చలికి, ఆక్సిజన్ కొరతకు గురికాలేదు. ఈ మార్గంలో విమానం తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల హైపోక్సియా, హైపోథెర్మియా ప్రభావం తక్కువగా ఉండొచ్చు. విమాన పరిశోధకుల అంచనా ప్రకారం, అతను వెనుక భాగంలోని సెంట్రల్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఒక సురక్షితమైన మూలలోకి దూరి ఉండవచ్చు. అక్కడ హైడ్రాలిక్ పరికరాలకు దగ్గరగా ఉండటం వల్ల అతనికి కొద్దిగా వెచ్చదనం లభించి ఉండవచ్చు. పిల్లలు పెద్దల కంటే శారీరక ఒత్తిడిని బాగా తట్టుకోగలరు. అతని చిన్న శరీర పరిమాణం కూడా అతన్ని సురక్షితమైన స్థలంలో ఇరుక్కోవడానికి సహాయపడి ఉండవచ్చు.
ఢిల్లీ విమానాశ్రయంలో..
విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు, గ్రౌండ్ సిబ్బంది ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయారు. అతను భయంతో ఉన్నప్పటికీ ప్రాణాలతో ఉన్నాడు. భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో అతని చిన్న ఎర్రని స్పీకర్ ఒకటి దొరికింది. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications