తాలిబన్ల దారుణం : సొంత అన్న చేతనే చెల్లెల్ని..

కాబుల్ : మత చాంధసవాదం.. తాలిబన్ల జోక్యం అధికంగా ఉండే ఆఫ్ఘన్ లో చాలామంది ఆడబిడ్డలు తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. తాజాగా ఇంట్లోంచి వెళ్లిపోయిందన్న కారణంతో.. సొంత అన్న చేతనే ఓ యువతిని హత్య చేయించారు తాలిబన్లు. ఆఫ్ఘన్ లోని కోహిస్తానత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల ఆజాదా అనే యువతి రెండు నెలల క్రితం ఇంటినుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే కొద్ది రోజులకు ఆమె అతడి సోదరుడి కంటపడడంతో.. తిరిగి ఆజాదాను ఇంటికి తీసుకొచ్చాడు ఆమె సోదరుడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ అనంతరం తాలిబన్లతో కలిసి చెల్లెలు అని కూడా చూడకుండా కాల్చి చంపేశాడు.

Afghan Taliban publicly execute young woman

తాలిబన్ల కను సైగల్లో మహిళలు జీవనం కొనసాగించాల్సి వస్తుండడంతో.. వాళ్ల నిబంధనలు అతిక్రమించిన మహిళలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. కాగా, తాజా ఘటనపై స్పందించిన ఆఫ్ఘన్ లోని మానవ హక్కుల కమిషన్ దేశంలో మహిళలపై తాలిబన్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని ప్రకటించింది. గతేడాది తొలి ఆరు నెలలో మహిళలపై హింసకు సంబంధించి 2,579 కేసులు నమోదయినట్లుగా తెలిపింది మానవ హక్కుల కమిషన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+