అఫ్గానిస్తాన్‌: దేశం పేరు మార్చిన తాలిబాన్లు, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం

ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్

అఫ్గానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది.

ఈ ప్రభుత్వాన్ని తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నడిపిస్తారని, ఆయనకు డిప్యూటీగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరిస్తారని తాలిబాన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ విలేకరులకు తెలిపారు.

ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్‌ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో ఉన్నారు.

''మా దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు’’ అని జుబీహుల్లా అన్నారు.

20 ఏళ్ల యుద్ధానికి తెరదించుతూ ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటులో ఈ తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు కీలకమైనది.

ఇందులో ముల్లా యాకూబ్‌ రక్షణ మంత్రిగా, ముల్లా అబ్దుల్ సలామ్ హనాఫీ సెకండ్ డిప్యూటీగా, అమీర్ ఖాన్ ముత్తాకి విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

మిలిటెంట్ గ్రూప్ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ అధిపతి సిరాజుద్దీన్ హక్కానీ దేశ హోం మంత్రిగా నియమితులయ్యారు. ఈయన ఇప్పటికీ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు అమెరికా, దాని మిత్ర సైన్యాలకు - తాలిబాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో హక్కానీ పలు ప్రాణాంతక దాడుల సూత్రధారి.

తాలిబాన్లకు అనుబంధంగా పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా పరిగణిస్తోంది.

అయితే, క్యాబినెట్‌లో మహిళలు ఎవరూ లేరని బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ ప్రస్తావించగా.. తాలిబాన్ అధికారి అహ్మదుల్లా వసీక్ స్పందిస్తూ.. ఇది పూర్తి స్థాయి క్యాబినెట్ కాదని తెలిపారు.

తాలిబన్ల నాయకత్వం

'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌’

అఫ్గానిస్తాన్‌ ఇకపై అధికారికంగా ''ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌’’ అవుతుందని తాలిబాన్ అధికారి అహ్మదుల్లా వసీక్ బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీతో చెప్పారు.

https://twitter.com/seckermani/status/1435257847777013761

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+