వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

48 ఏళ్ళ తర్వాత డిఎంకె కు కొత్త 'సూర్యుడు',అళగిరి ఏం చేస్తాడు, కనిమొళి ఎందుకు రాలేదు

48 ఏళ్ళ తర్వాత డిఎంకె లో కొత్త నాయకత్వం వచ్చింది. ఇప్పటివరకు కరుణానిధి నాయకత్వంలో కొనసాగిన పార్టీ ఇక స్టాలిన్ నాయకత్వంలో సాగనుంది.యువనాయకుడు పార్టీ పగ్గాలు చేపట్టడం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :డిఎంకె పార్టీలో కొత్త నాయకత్వం ప్రారంభమైంది. కరుణానిధి నాయకత్వంలో ఇప్పటివరకు కొనసాగిన పార్టీ ఇక స్టాలిన్ నాయకత్వం నడవనుంది. తన రాజకీయ వారుసుడు స్టాలిన్ అని ప్రకటించిన కరుణానిధి, ఆయనకే పార్టీ పగ్గాలను అప్పగించాడు..యువ నాయకుడు స్టాలిన్ పార్టీని బలోపేతం చేస్తాడని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. స్టాలిన్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.48 ఏళ్ళ తర్వాత పార్టీ నూతన నాయకత్వంలోకి మారింది.కరుణానిధి తర్వాత స్టాలిన్ పార్టీ పగ్గాలను చేపట్టారు.

డిఎంకె పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్య పరిస్థితుల కారణంగా పార్టీ బాద్యతలను తనయుడు స్టాలిన్ కు అప్పగించాలని భావించాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించాడు.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి ఈ విషయమై కొంత తండ్రితో విభేదించాడు. పార్టీ నాయకత్వ బాద్యతలను తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశాడు.అయితే స్టాలిన్ వైపే కరుణానిధి మొగ్గుుచూపాడుదీంతో స్టాలిన్ కు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు మార్గం సుగమమైంది.

పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ కు బాద్యతలను కట్టబెట్టారు. గత ఏడాది డిసెంబర్ మాసంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉండగా, కరుణానిధి అస్వస్థతకు గురికావడంతో పాటు ఈ సమావేశాన్ని వాయిదావేశారు. ఇవాళ చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకొన్నారు.

డిఎంకెలో స్ఠాలిన్ నాయకత్వం

డిఎంకెలో స్ఠాలిన్ నాయకత్వం

డిఎంకె పార్టీలో స్టాలిన్ నాయకత్వం ప్రారంభమైంది. 48 ఏళ్ళ తర్వాత డిఎంకె లో కరుణానిధి కాదని మరో వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టారు. ఇప్పటివరకు కరుణానిధే పార్టీని నడిపించాడు. అయితే కరుణ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరించిన వైగో పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యాడు.స్టాలిన్ కు రాజకీయ వారసరత్వాన్ని కరుణానిధి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతోనే వైగో పార్టీ నుండి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.యువ నాయకుడు స్టాలిన్ కు పార్టీ పగ్గాలను అప్పగించడం ద్వారా పార్టీకి ప్రయోజనం ఉంటుందని భావించిన కరుణానిధి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని నిర్ణయించాడు. ఈమేరకు పార్టీ జనరల్ బాడీ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ పేరును ప్రతిపాదించగానే సభ్యులంతా ఏకగ్రీవంగా ఆయనను ఆమోదం తెలిపారు.48 ఏళ్ళ తర్వాత కొత్త నాయకత్వంలో డిఎంకె పనిచేయనుంది.

అళగిరికి ఏం చేస్తారు

అళగిరికి ఏం చేస్తారు

డిఎంకె నుండి బహిష్కరణకు గురైన అళగిరికి తమిళనాడు దక్షిణ ప్రాంతం ఇన్ చార్జిగా భాద్యతలను కట్టబెడతారనే ప్రచారం సాగింది.అయితే పార్టీ నుండి ఆయనను గతంలో బహిష్కరించారు. ఇవాళ జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అళగిరిపై సస్పెన్షన్ వేటు విషయం ప్రస్తావనకు రాలేదు. అళగిరి గతంలో తాను నిర్వహించిన భాద్యతలను కొనసాగిస్తే స్టాలిన్ కు పార్టీ పగ్గాలను అప్పగించేందుకు అభ్యంతరం లేదన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే పార్టీ సర్వసభ్య సమావేశంలో అళగిరిపై వేటు వేసిన అంశం ప్రస్తావనకు రాకపోవడం కూడ చర్చసాగుతోంది.

సమావేశానికి హజరుకాని కరుణానిది, సోదరి కనిమొళి

సమావేశానికి హజరుకాని కరుణానిది, సోదరి కనిమొళి

డిఎంకె కీలకమైన సర్వసభ్య సమావేశానికి పార్టీ చీఫ్ కరుణానిధి హజరుకాలేదు. అనారోగ్య పరిస్థితుల కారణంగానే కరుణానిధి ఈ సమావేశానికి హజరుకాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే కరుణానిధి ఈ సమావేశానికి హజరు కానున్నారని తొలుత ప్రచారం సాగింది. అయితే ఆరోగ్యం సహకరించని కారణంగా కరుణానిధ లేకుండానే ఈ సమావేశం ముగిసింది.అయితే ఈ సమావేశానికి కనిమొళి కూడ హజరుకాలేదు. పార్టీలో కీలకమైన భాద్యతలను కనిమొళికి ఇవ్వనున్నారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ సమావేశంలో అలాంటి చర్చే జరగలేదు.కనిమొళి కూడ ఎందుకు రాలేదనే విషయమై పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వలేదు.

కొత్త నాయకత్వాలతో ద్రవిడ పార్టీలు

కొత్త నాయకత్వాలతో ద్రవిడ పార్టీలు

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా ఉన్న అన్నాడిఎంకె, డిఎంకె పార్టీ లకు కొత్త నాయకత్వాలు వచ్చాయి,. యాధృఛ్చికమే కావచ్చు. రెండు పార్టీలకు కొత్త నాయకులను ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి బాద్యతలను శశికళ స్వీకరించారు. అన్నాడిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. మరో వైపు డిఎంకె చీఫ్ కరుణానిధికి అనారోగ్య పరిస్థితులు నెలకొనడంతో .పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకొన్నారు. రెండు పార్టీలు కొత్త నాయకత్వాలతో తమిళనాడులో ఇక పనిచేయనున్నాయి.

శశికళ తో స్టాలిన్ సమరం

శశికళ తో స్టాలిన్ సమరం

అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరూ కూడ పార్టీ నాయకత్వం పగ్గాలను కొత్తగా చేపట్టారు.అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో చాలాకాలంగా స్టాలిన్ కొనసాగుతున్నారు.ఇది స్టాలిన్ కలిసివచ్చే అంశం.శశికళ మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
జయలలిత బతికున్న కాలంలో ఆమె వెన్నంటి ఉన్నారు. జయ తీసుకొన్న నిర్ణయాల్లో శశికళ కూడ పాలుపంచుకొనేవారే ప్రచారం కూడ ఉంది.యితే ప్రత్యక్ష రాజకీయాల్లో శశికళ లేకపోవడం కొంత ఆమెకు మైనస్ గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ వ్యూహలతో ఆమె ఇప్పటికే పార్టీపై పట్టుసాధించారు. ముఖ్యమంత్రిగా కూడ బాద్యతలను చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్టీ సీనియర్లు కూడ ఆమెను ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టాలని కోరుతన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే శశికళను కూడ తక్కువగా అంచనావేయలేమనే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
after 48 years new leadershipn in dmk, for the past 48 years dmk under the leadership of the karunanidhi ,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X