జైల్లో శశికళ దర్జాగా, ఒక్క కొవ్వొత్తి చేయలేదు: విజువల్స్ బయటకు

చిన్నమ్మ శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా మరోసారి వార్తలు వెలువడుతున్నాయి.

Recommended Video

    Sasikala Wont Be Making Candles In Jail జైల్లో శశికళ దర్జాగా.. | Oneindia Telugu

    చెన్నై: చిన్నమ్మ శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా మరోసారి వార్తలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమెను అన్నాడీఎంకే పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

    శశికళకు మరిన్ని కష్టాలు

    శశికళకు మరిన్ని కష్టాలు

    దీంతో శశికళను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ చాలా దర్జాగా, సుఖంగా ఉంటున్నట్లుగా ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా తేలింది.

    శశికళకు రాజభోగాలు

    శశికళకు రాజభోగాలు

    జైలులో శశికళకు రాజభోగాలు అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఐదు రూంల సూట్, ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వివిఐపిలా ఆమె జీవిస్తున్నారు. శశికళకు కొవ్వొత్తుల తయారీ అప్పగించారు. కానీ ఆమె ఇప్పటి వరకు ఒక్క క్యాండిల్ చేయలేదు. ఆమె చేసిన డ్యూటీ వివరాలు ఏమీ లేవు.

    పని అప్పగించలేదు, మీడియా చేతిలో విజువల్స్

    పని అప్పగించలేదు, మీడియా చేతిలో విజువల్స్

    ఇందుకు సంబంధించి విజువల్స్ కూడా మీడియా చేతికి చిక్కాయి. ఇప్పటి వరకు ఆమెకు జైలు అధికారులు ఎలాంటి పని అప్పగించక పోవడం గమనార్హం. శశికళకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వలేదు.

    24 మంది విఐపిలు కలిశారు

    24 మంది విఐపిలు కలిశారు

    శశికళను ఇప్పటి వరకు 24 మంది వీఐపీలు కలిసినట్లుగా తెలుస్తోంది. శశికళ రాజభోగాలపై తొలుత డిఐజి రూప వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. జైల్లో ఆమె లంచాలు ఇచ్చి రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+