బెంగళూరు మరవకముందే.. అమ్మాయి పట్ల ఢిల్లీలో షాకింగ్ వీడియో
బెంగళూరులో కొత్త ఏడాది సందర్భంగా అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు ఓ వైపు కలకలం రేపుతుండగానే, దేశ రాజధాని ఢిల్లీలో మరో వీడియో కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీ: ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త ఏడాది సందర్భంగా అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు ఓ వైపు కలకలం రేపుతుండగానే, దేశ రాజధాని ఢిల్లీలో మరో వీడియో కలకలం రేపుతోంది.
ఢిల్లీలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఓ యువతిని కొందరు యువకులు వేధించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో దొరకడంతో ఘాతుకం వెలుగు చూసింది.

ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి ఒక యువతిపై వేధింపులకు పాల్పడిన కొందరు యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు పోలీసులపై కూడా తిరగబడటం గమనార్హం. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఇద్దరు మహిళా పోలీసు సిబ్బందిని గాయపరిచారు.
డిసెంబర్ 31 రాత్రి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు, ఒక యువతి బైక్ పైన వస్తున్నారు. కొందరు యువకులు వారిని వెంబడిస్తూ వచ్చారు. ఇద్దరితో ఉన్ యువతిని కిందికి లాగేందుకు ప్రయత్నించారు.
అది గమనించిన వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆమెను రక్షించారు. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నట్లు పోలీసు అధికారి అనిల్ కౌశిక్ తెలిపారు.
అయితే, తప్పించుకున్న యువకులు మాత్రం తిరిగి వచ్చి పోలీసు వాహనం పైన రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు మహిళా పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది కంటే యువకులు చాలా ఎక్కువ మంది ఉండటంతో ఎదురుదాడి చేయలేకపోయినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications