అయ్యో టీనా.. పెళ్లి పెటాకులేనా? ఐఏఎస్ జంట ‘సోషల్’ డిస్టెన్స్.. రెండేళ్లకే వైరాగ్యం..
టీనా దాబి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటిదాకా సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికంటే ఎక్కువగా దేశంలో పాపులారిటీ పొందిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఫేస్ బుక్ లో దాదాపు 3 లక్షలు, ట్విటర్ లో 1.2లక్షలు, ఇన్‌స్టాలో మరో 5 లక్షల మంది అనుసరిస్తుంటారు. యువతలో స్ఫూర్తిని నింపుతూ ఆమె రాసే వాక్యాలు, ఇచ్చే సూచనలు, చేసే ప్రసంగాలు చాలా సార్లు వార్తలుగానూ మారాయి. 2016 సివిల్స్ లో ఫస్ట్ ర్యాంకరైన టీనా.. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే.. అదే ఏడాది రెండో ర్యాంకర్ అథర్ ఆమిర్ ఖాన్ ను ప్రేమించడం, అకాడమీ వీడిన వెంటనే ఆ ప్రేమజంట పెళ్లి బంధంతో ఒకటికావడం, సదరు లవ్ స్టోరీపై పుంఖానుపుఖాలుగా కథనాలు రావడం తెలిసిందే. ఇప్పుడు విడిపోతూ కూడా వాళ్లు మళ్లీ వార్తల్లో నిలిచారు..

కట్ చేస్తే..
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకున్నాక, టీనా దాబీ తన పేరు పక్కన ఖాన్ చేర్చుకుంది. ఆమిర్ ఖాన్ కాశ్మీరీ కావడంతో.. టీనా తనను కాశ్మీరీ కోడలిగా అభివర్ణించుకునేంది. వీకెండ్స్ లో ఔటింగ్ ఫొటోలతో ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్' కపుల్ గానూ ఖ్యాతి పొందారు. ప్రస్తుతం రాజస్తాన్ లో పనిచేస్తున్న టీనా సడెన్ గా తన పేరు పక్కన ఖాన్ తోకను కట్ చేసింది. కాశ్మీరీ కొడలు ట్యాగ్ ను కూడా తొలగించింది. గతవారం ఆమె ఈ చర్యకు పాల్పడగా, భర్త ఆమీర్ కూడా ఘాటుగానే స్పందించాడు..

సోషల్ డిస్టెన్స్
కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో జనమంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే.. ఈ భార్యాభర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ముందుగా ఆమీర్.. టీనాకు సంబంధించిన అన్ని అకౌంట్లను అన్ ఫాలో చేయగా.. భార్యామణి కూడా భర్తను అదేవిధంగా దూరంపెట్టింది. అంతటితో ఆగకుండా.. సోలో లైఫ్ ఎంత బెంటరో.. వైరాగ్య ధోరణిలో చెప్పుకొచ్చింది. ‘‘గమ్యం దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నేను ఒంటరిని. దారి మధ్యలో ఎంతో మంది కలుస్తూ, పలకరిస్తూ వెళ్లిపోతుంటారు..''అని స్టేటస్ పెట్టేసింది.

దోస్తుల విఫలయత్నం..
టీనా-ఆమిర్ ప్రేమ వ్యవహారం ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచే చాలా రకాల విమర్శలు తలెత్తాయి. లవ్ జీహాద్ లో ఆమెను ఆమీర్ ట్రాప్ చేశాడని కొందరు చొక్కాలు చించుకున్నారు. ఆ విమర్శలకు టీనా ఎప్పటికప్పుడు ఘాటుగా సమాధానాలిస్తూ వచ్చింది. కానీ ఇంతలోనే ఏం జరిగిందో స్పష్టంగా వెల్లడికానప్పటికీ.. దంపతులిద్దరూ సోషల్ మీడియాలో పోట్లాడుకోవడం, ఆమె తన స్టేటస్ సింగిల్ అని పెట్టడం గమనార్హం. కామన్ ఫ్రెండ్స్ నచ్చచెప్పినా వినిపించుకునే స్థితిలో వాళ్లిద్దరూ లేరని, అధికారికంగా విడాకులు తీసుకోకున్నా, ఆల్మోస్ట్ విడిపోయినట్లేననే చర్చ నడుస్తోంది.

ఫేక్ తిప్పలు..
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తాను తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ పేరుతో ఓ పోస్టు వైరల్ కావడం, పలు చానెళ్లు దీనిపై వార్తలు ప్రసారం చేయడంతో ఆమె వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరికది ఫేక్ అకౌంట్ అని తేలింది. టీనా పాపులారిటీ దృష్ట్యా ఆమె పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన సోషల్ మోసగాళ్లు ఈ పని చేశారు. భర్త నుంచి దూరమయ్యే విషయంలో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ కు తావివ్వకుండా టీనా దాబి ఫుల్ క్టారిటీ మెయింటెయిన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications