వావ్.. తలైవా, వయస్సు కేవలం అంకెలు మాత్రమే, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో రజనీకాంత్‌పై నెటిజన్ల ప్రశంసలు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన అడ్వేంచర్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ నెటిజన్ల మనస్సు గెలిచింది. వయస్సు మనిషికే కానీ మనస్సు కాదని ట్వీట్లు చేశారు. బేర్‌గ్రిల్స్‌తో కలిసి రజనీకాంత్ చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ సోమవారం రాత్రి డిస్కవరీ చానెల్‌లో ప్రసారమైంది. షో చూసిన వెంటనే నెటిజన్లు తలైవా ఆన్ డిస్కవరీ అంటూ ట్వీట్లు చేశారు. కర్ణాటకలోని బండీపూర్ జాతీయ పార్క్‌లో రజనీతో బేర్‌గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ అడ్వేంచర్ చేశారు.

ఇందులో ప్రముఖమైనది రజనీకాంత్ బ్రిడ్జీ దాటుకుంటూ వెళ్లడమే. భూమికి 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జీపై.. ఇనుప రాడ్డును పట్టుకొని బేర్‌గ్రిల్స్‌తో కలిసి దాటారు. అయితే దాటే సమయంలో ఇనుప రాడ్డు వేడిగా ఉందని రజనీకాంత్ కామెంట్ చేశారు. పార్క్‌లో చెట్లు, చేమల కన్నా రజనీకాంత్ బాగున్నారని నెటిజన్లు పొగిడారు. తలైవా రాక్ అంటూ కామెంట్లు పెట్టారు
రజనీకాంత్ ఎపిసోడ్‌ను బేర్‌గ్రిల్స్ జనవరిలో షూటింగ్ చేశారు. షూటింగ్ చేసే సమయంలో రజనీకి గాయాలు అయ్యాయనే ప్రచారం జరిగింది. కానీ తనకేమీ గాయాలు కాలేదని.. చిన్నగా ఓర్చుకుపోయిందని రజనీకాంత్ పర్కొన్నారు. బేర్‌గ్రిల్స్‌తో కలిసి చేసిన అడ్వెంచర్ మరచిపోలేని అనుభూతిని కలిగించిందని చెప్పారు. ఇదివరకు ప్రధాని మోడీ బేర్‌గ్రిల్స్‌తో కలిసి అడ్వేంచర్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ చేసిన అడ్వేంచర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బేర్‌గ్రిల్స్‌తో కలిసి అడ్వేంచర్ చేశారు.












Click it and Unblock the Notifications