శశికళకు షాక్: సంక్రాంతి బరిలో జయ మేనకోడలు దీపా
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంక్రాంతి పండుగ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అభిమాన సంఘాల నాయకులు చెప్పారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంక్రాంతి పండుగ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అభిమాన సంఘాల నాయకులు చెప్పారు.
శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా ఎన్నిక కావడం అన్నాడీఎంకే పార్టీలోని ద్వితీయ, తృతీయ పార్టీ శ్రేణులకు ఇష్టం లేదు. శశికళకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. జయలలిత మేనకోడలు దీపాను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

చెన్నైలోని టీనగర్ లో ఉన్న దీపా ఇంటి దగ్గరకు ఇప్పుడు క్యూకడుతున్నారు. అమ్మ వారసురాలిగా మీరు రాజకీయాల్లోకి రావాలని తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్, దీపాల ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
దీపా పురట్చి, దీపా మలర్ పేరవై, అమ్మాడీఎంకే పార్టీ అని ఇప్పటికే నామకరణం చేశారు. దీపా మాట్లాడటం, ఆమె హావభావాలు, ఆమె స్పందించే తీరు అచ్చం జయలలిత పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు.
అయితే తాను సమయం చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని తనను కలిసిన అభిమానులతో దీపా జయకుమార్ చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా దీపా జయకుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications