నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్
అన్నాడీఎంకే పార్టీ నుంచి నెచ్చెలి శశికళ నటరాజ్ ను తాము బహిష్కరించామని, ఆమెతో మాకు ఎటువంటి సంబంధాలు లేవని ఆపార్టీ ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి నెచ్చెలి శశికళ నటరాజ్ ను తాము బహిష్కరించామని, ఆమెతో మాకు ఎటువంటి సంబంధాలు లేవని ఆపార్టీ ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. శశికళ ఎప్పటికి తమిళనాడుకు చిన్నమ్మ కాలేరని తేల్చిచెబుతున్నారు.
జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు
తమిళనాడులోని మధురై, ఈరోడ్డు, తిరుచ్చి, తేనీ, తిరుప్పూరు, కోవై, తిరువణ్ణామలై, తంజావూరు, విల్లుపురం తదితర జిల్లాల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చెన్నైలోని టీ నగర్ లో ఉన్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు.

జయలలిత గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉందని దీపాను ఉద్దేశించి నినాదాలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను అంగీకరించలేమని అన్నారు. జయలలితకు ద్రోహం చెయ్యడానికి ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలోని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
శశికళ మీద పోటీ చేస్తా: జయలలిత మేనకోడలు దీపా చాలెంజ్
మీరు త్వరగా రాజకీయాల్లోకి రావాలని దీపాకు చెప్పారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి దీపా మాట్లాడారు. మీరు శాంతియుతంగా ఉండాలని, అన్ని త్వరలో సర్దుకుంటాయని నచ్చచెప్పారు.
శశికళ అడుగులకు మడుగులు తొక్కుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు తాము త్వరలోనే బుద్ది చెబుతామని, నియోజక వర్గాల్లో అడుగు పెట్టనివ్వకుండా చూస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. అమ్మకు నిజమైన వారుసురాలు ఎవరో అనే విషయం ఓటు ద్వారానే మేము ప్రపంచానికి చాటిచెబుతామని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెప్పారు.












Click it and Unblock the Notifications