వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు ఎదురు దెబ్బ: మీరు సీఎం కాలేరు, ఎమ్మెల్యే రాజీనామా !

శశికళను అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా నియమించి ఇప్పుడు మళ్లీ ఆమెను సీఎం చెయ్యాలని చూస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సొంత పార్టీకి చెందిన మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తన పదవికి రాజీనామా చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని ఆశగా ఎదురు చూస్తున్న నెచ్చెలి శశికళకు షాక్ ఇవ్వడానికి పార్టీ నాయకులు సిద్దం అయ్యారు. అమ్మ తరువాత చిన్నమ్మగా పార్టీలో వెలిగిపోవాలని ప్రయత్నిస్తున్న శశికళకు ఎమ్మెల్యే చుక్కలు చూపించారు.

ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ను నియమించడం, ఇప్పుడు ఆమెను సీఎంగా కుర్చోపెట్టాలని ప్రయత్నిస్తున్నారని, ఇది మంచిపద్దతి కాదని నిరసన వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే నటరాజ్ తన పదవికి రాజీనామా చేశారు.

AIADMK MLA Natraj may resign from his post against Sasikala took over the party.

శశికళ నియంతలా వ్యవహరిస్తున్నారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని నటరాజ్ తన అనుచరులు, కార్యకర్తలకు విషయం చెప్పి గురువారం శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆలేఖను శశికళ చేతికి ఇచ్చారని సమాచారం. మైలాపూర్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందిన నటరాజ్ జయలలితకు వీరాభిమాని.

శశికళకు షాక్: సంక్రాంతి బరిలో జయ మేనకోడలు దీపా

నటరాజ్ కు నియోజక వర్గంలో మంచిపేరు ఉంది. పార్టీలోనా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళను నియమించడం ఎమ్మెల్యే నటరాజ్ తో పాటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గం ప్రజలకు ఎంత మాత్రం ఇష్టం లేదు.

AIADMK MLA Natraj may resign from his post against Sasikala took over the party.

ఇప్పటికే తమిళనాడులోని అనేక జిల్లాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందరూ జయలలిత మేనకోడలు దీపాకు జై కొడుతున్నారు.

శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ !

ఈ సందర్బంలో సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుడు తెగించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ధైర్యంగా శశికళను ఎదిరించడంతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోయారు. నటరాజ్ బాటలో ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందని పలు జిల్లాల్లోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

English summary
Sources said that Mylapore AIADMK MLA Natraj may resign from his post against Sasikala took over the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X