మాజీ సీఎం టార్గెట్, హీరో సుదీప్, ప్రియాంక గాంధీ పోటాపోటీ రోడ్ షోలు, రిజల్ట్ మాత్రం ?
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు పోటాపోటీ పడుతున్నారు. ప్రముఖ హీరో, బహుబాష నటుడు కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో దుమ్ములేపుతున్నాడు. కన్నడ హీరోలు సుదీప్, దర్శన్ ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నాయకులు విజయం మాదే అంటూ ధీమాగా ఉన్నారు.
హీరో కిచ్చా సుదీప్ హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హుబ్బళి చేరుకున్న హీరో సుదీప్ కు బీజేపీ నాయకులు, ఆయన అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హీరో సుదీప్ రోడ్ షోలో పాల్గొన్నారు.

బీజేపీ మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇదే హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు జర్క్ ఇవ్వడానికి బీజేపీ నాయకులు హీరో సుదీప్ తో హుబ్బళిలో రోడ్ షో ఏర్పాటు చేసి మహేష్ టింగినకాయకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయించారు.
అియితే హీరో సుదీప్ మాత్రం ఎక్కడా జగదీష్ శెట్టర్ ను పేరుపెట్టి విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేసిన సుదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీజేపీ నాయకులకు భారీ షాక్ ఇవ్వడానికి హుబ్బళి-ధారవాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంక గాంధీతో రొడ్ షో ఏర్పాటు చేశారు.

శుక్రవారం హీరో సుదీప్ ఎన్నికల ప్రచారం చేస్తే మరుసటి రోజు శనివారం (ఏప్రిల్ 29వ తేదీ) ప్రియాంక గాంధీతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు మద్దతుగా రోడ్ షో, ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. మొత్తం మీద హుబ్బళిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కోసం రోడ్ షోలు నిర్వహించడంతో ఆ ప్రాంతంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications