స్పందిస్తున్న జయ, రాత్రి 11గం.లకు మళ్లీ పరీక్షలు: మోడీకి వెంకయ్య అప్‌డేట్

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అపోలో వైద్యుల బృందం ఈ రోజు (సోమవారం) రాత్రి పదకొండు గంటలకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అపోలో వైద్యుల బృందం ఈ రోజు (సోమవారం) రాత్రి పదకొండు గంటలకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. వారు జయ గుండె తీరును పరిశీలిస్తారు. ఈ పరీక్షల అనంతరం వారు జయ ఆరోగ్యంపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

పరీక్షల నివేదిక ఆధారంగా వైద్యులు రాత్రి పదకొండు గంటల అనంతరం ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సోమవారం రాత్రి వైద్యులు ప్రకటన చేశారు. జయలలిత వైద్య పరీక్షలకు స్పందిస్తున్నారని తాజాగా ప్రకటించారు. ఈ రాత్రి 11 గంటలకు జయలలితకు మరోసారి వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

jayalalithaa

కాగా, అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు లండన్ డాక్టర్ రిచర్డ్ బాలేతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారని తెలుస్తోంది. ఎయిమ్స్ వైద్యులు, అధికారులు, డాక్టర్లు కూడా చర్చించారు.

మోడీకి సమాచారం ఇస్తున్న వెంకయ్య

జయలలిత ఆరోగ్య పరిస్థితి, తమిళనాడులోని తాజా పరిస్థితుల్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం ఇస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు ఆసుపత్రికి వచ్చిన వెంకయ్య అపోలో ఆసుపత్రి ఛైర్మన్‌ ప్రతాప్ రెడ్డి సహా పలువురు డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం గవర్నర్‌ విద్యాసాగర రావు, సీఎస్‌లతో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+