దుబాయ్ నుంచి వచ్చి ప్రియుడి అపార్ట్ మెంట్ లో ?, డేటింగ్ యాప్ టెక్కీ ప్రియుడికి బెండ్, అసలు మ్యాటర్ ?

ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకునేలా ఆమె టెక్కీ ప్రియుడు రెచ్చగొట్టాడని ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు: ప్రియుడు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి పడి ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనా ధీమన్ అలియాస్ అర్చనా (28) ఆనే ఎయిర్ హోస్ట్ ఆత్మహత్య చేసుకుందని ఆమె ప్రియుడు చెప్పాడని పోలీసు అధికారులు అన్నారు. అయితే ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకునేలా ఆమె టెక్కీ ప్రియుడు రెచ్చగొట్టాడని ఆరోపణలు రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోరమంగళలోని టెక్కీ ప్రియుడు

కోరమంగళలోని టెక్కీ ప్రియుడు

ఆత్మహత్య చేసుకున్న ఎయిర్ హోస్ట్ శుక్రవారం అర్ధరాత్రి కోరమంగళలోని 8వ బ్లాక్‌లోని రేణుకా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని 4వ అంతస్తులో ఉన్న ప్రియుడి అపార్ట్ మెంట్ లోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అర్చనా ప్రేమికుడు మంగళూరుకు చెందిన ఆదేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మంగళవారం కోరమంగళ పోలీసు అధికారులు తెలిపారు.

డేటింగ్ యాప్ లో ?

డేటింగ్ యాప్ లో ?

అర్చనా ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆమె ప్రియుడు ఆదేశ్ బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం డేటింగ్ యాప్‌లో అర్చనా, ఆదేశ్‌లు ఒకరికొకరు పరిచయం అయ్యారు, ఇద్దరి పరిచయం స్నేహంగా మారి తరువాత ప్రేమించుకోవడం మొదలుపెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 దుబాయ్ నుంచి వచ్చిన అర్చనా

దుబాయ్ నుంచి వచ్చిన అర్చనా

కొన్ని విషయాల్లో అర్చనా, ఆదేశ్ ల మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే తరుచూ గొడవలు పడేవారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పని నిమిత్తం దుబాయ్‌లో ఉన్న అర్చనా నాలుగు రోజుల క్రితం దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చింది. వీరిద్దరూ నాలుగు రోజుల నుంచి కోరమంగళలోని ఆదేశ్ అపార్ట్ మెంట్ లోనే కలిసి ఉన్నారని పోలీసులు అన్నారు.

రాత్రి మాల్ లో సినిమా... ఇంట్లో లిక్కర్ పార్టీ

రాత్రి మాల్ లో సినిమా... ఇంట్లో లిక్కర్ పార్టీ

శుక్రవారం సాయంత్రం అర్చనా, ఆదేశ్ కోరమంగళలోని ఫోరం మాల్‌లో సినిమాకు వెళ్లారు. రాత్రి సినిమా చూసి అపార్ట్‌మెంట్‌కి వచ్చి ఇద్దరూ కలిసి మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. అర్చనా అర్ధరాత్రి 12 గంటల తరువాత అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసిందని అంటున్నారు.

టెక్కీ నోరు విప్పితేనే ?

టెక్కీ నోరు విప్పితేనే ?


ఈఘటనలో అర్చనా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు చెప్పారు. అర్చనా ఆత్మహత్య చేసుకుందని ఆమె ప్రియుడు ఆదేశ్ అంటున్నాడు. అయితే అర్చనా ఆత్మహత్య చేసుకున్న తరువాత మాయం అయిన మంగళూరుకు చెందిన టెక్కీ ఆదేశ్ ను బెంగళూరులోని కోరమంగల పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+