అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం- 242 మంది ప్రయాణికులు..
అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలింది. అది- ఎయిరిండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.

సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం అది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.
అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సమాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాని వినియోగించారు.
ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications