ఇండిగో సంక్షోభం.. ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఇండిగో పలు విమానాలు రద్దు చేస్తున్న క్రమంలో ఎమర్జెన్సీ పని మీద వెళ్లాల్సిన వారు విమానాశ్రయాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో.. గత వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 2 వేలకుపైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇక ఓవైపు ఇండిగో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

ఇండిగో సంక్షోభం వేళ.. ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది. పైలట్ల రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను చేపట్టింది. నిర్వహణ లోపం, పైలట్ల కొరత, పైలట్ల పనిగంటల వ్యవహారం.. తదితర కారణాల నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. పైలట్ల కొరత కారణంగానే గత వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 2 వేల విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ క్రమంలో టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పైలట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ అవుతోంది.

'ఆకాశానికి హద్దుల్లేవు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే' అని పైలట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎయిర్ ఇండియా హక్కులను 2021లో తిరిగి టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ A320, బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్, కోర్ వర్క్ హార్సెస్ షార్ట్ అండ్ మీడియం హాల్ రూట్స్ కు పైలట్స్ కావాలంటూ ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఇండిగో సంస్థ సంక్షోభం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఈ నోటిఫికేషన్ వైరల్ గా మారింది.

Air India Seizes Opportunity Pilot Hiring Drive Launched Amid IndiGo s Crew Crisis Chaos

ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది ఎయిర్ ఇండియా సంస్థ. బోయింగ్ 737, ఎయిర్ బస్ A320 లకు సమర్థవంతమైన పైలట్లను ఆహ్వానిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇక ఎయిర్ ఇండియా సంస్థ ప్రతి విమానాన్ని 5.4 మంది పైలట్లతో నిర్వహిస్తోంది. అయితే ఇండిగో సంస్థ మాత్రం 2.5 పైలట్లతోనే నిర్వహిస్తోంది. ఇక ప్రస్తుతం ఇండిగో సంస్థ సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆ సంస్థ చెబుతున్నప్పటికీ.. క్యాన్సిలేషన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+