రాబర్ట్ వాద్రాకు షాక్: తనిఖీ మినహాయింపు జాబితా నుంచి ఔట్
గోవా: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు షాక్ ఇచ్చారు. యూపిఏ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పరంగా అందే అన్ని రకాల ప్రత్యేక సేవలు పొందిన ఆయనకు ఇకపై ఆ హోదా కల్పించబోమంటూ ఏకంగా ఎయిర్ పోర్టులోనే నోటీసు అంటించారు.
అర్హత లేని వ్యక్తులకు ప్రత్యేక సేవల్ని నిలిపివేయాలంటూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. పౌర విమానయాన శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సేవలకు అర్హులైన వ్యక్తుల జాబితా నుంచి రాబర్ట్ వాద్రా పేరును తొలిగించామని గోవా ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ఎయిర్ పోర్టులోని జాబితాలో వాద్రా పేరును ప్లాస్టర్‌తో మూసివేశారు. 'ఏ చట్టప్రకారం ఆయనకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు?' అని సాధారణ ప్రయాణికులు కూడా తరచూ ప్రశ్నించేవారని గోవా ఎయిర్ పోర్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.
ప్లాస్టర్‌తో మూసివేయడంతో రాబర్ట్ వాద్రా పేరును మూసివేయడంతో కొందరు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. గోవాతోపాటు చాలా విమానాశ్రయాల్లో రాబర్ట్ వాద్రా పేరును ప్రత్యేక సేవలకు అర్హులైన జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications