ఎయిర్ టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్లు
డిస్నీ+ హాట్‌స్టార్(Disney+ Hotstar) తో కలిపి ఎయిర్‌టెల్(airtel) కొన్ని ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. అందులో మూడు నెలల కాలవ్యవధితో వస్తున్న ప్లాన్లకు మంచి ఆదరణ ఉంది. ఆ ప్లాన్లు ఏమేమిటనేవి తెలుసుకుందాం.
రూ.839 అన్ లిమిటెడ్ ప్లాన్: రూ.839 తో అన్ లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌ను చేసుకోవచ్చు. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. వ్యాలిడిటీ 84 రోజులు. 2జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

యూజర్లకు 2జీబీ డేటా కూపన్ వస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే సమయంలో దీన్ని క్లెయిం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో అన్ లిమిటెడ్ 5జీని ఎంజాయ్ చేయొచ్చు.
డిస్నీ+ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లోని ఏదో ఒక ఛానెల్‌ను 84 రోజుల పాటు వీక్షించొచ్చు. ఈరోస్‌నౌ, హోయ్‌చొయ్, సోనీలివ్, లయన్స్‌గేట్‌ప్లే, మనోరమామ్యాక్స్, చౌపల్, కచ్చాలంకా వంటి ప్రముఖ ఛానెళ్ల జాబితా నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందొచ్చు. అపోలో 24x7 సర్కిల్ సభ్యత్వం 3 నెలలు, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా లభిస్తాయి.
రూ.499 అన్ లిమిటెడ్ ప్లాన్: ఇందులో కూడా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ వస్తాయి. రోజుకి 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. 3జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. 5జీ డేటాను అన్ లిమిటెడ్ గా వినియోగించుకోవచ్చు.
వ్యాలిడిటీ 28 రోజులు. డిస్నీ+ హాట్‌స్టార్ ను 3 నెలలు పొందొచ్చు. అలాగే ఎంచుకున్న ఏదో ఒక ఎక్స్‌ట్రీమ్ ఛానెల్‌ను 28 రోజులు వినియోగించుకోవచ్చు. రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24x7 సర్కిల్ సభ్యత్వం మూడు నెలలు లభిస్తుంది. ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్ తోపాటు వింక్ మ్యూజిక్‌ను కూడా పొందొచ్చు.












Click it and Unblock the Notifications