అధికారులను బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే బెయిల్‌పై విడుదల...అనంతరం సంబరాలు...గాల్లోకి కాల్పులు
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అక్రమ కట్టడాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులను బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ వర్గీయాకు బోపాల్ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది..అయితే నాలుగు రోజుల జైలు శిక్ష తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే విజయ వర్గీయాకు కార్యకర్తలు, ఘన స్వాగతం పలికారు..అనంతరం స్వీట్లు పంచిపెట్టారు... కార్యకర్తలు స్థానికంగా ఉన్న పోలీసులకు సైతం స్వీట్లు పంచిపెట్టి , ఎమ్మెల్యే కార్యాలయం ముందు గాల్లోకి కాల్పులు జరిపారు.

బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే
గత నాలుగు రోజుల క్రితం ఇండోర్ నుండి మొదటి సారి ఎంపీకైన బీజేపీ ఎమ్మెల్యే, స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్ విజయ్ వర్గీయ కుమారుడు స్థానికంగా అక్రమంగా కట్టడాలను కూల్చుతున్న మున్సిపల్ అధికారులను అడ్డుకుని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే ఆయన అధికారులపై క్రికెట్ బ్యాట్‌తో కొట్టడడం సంచలనం రేపింది..దీంతో దాడి చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు..కాగా ఓ వైపు ప్రజలు, మీడియా చూస్తున్నారనే ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి అధికారులను బ్యాట్ కొట్టడడం ద్వార అనేక విమర్శలను , వ్యతిరేకతలను ఎదుర్కోన్నాడు.

విడుదల సంధర్భంగా స్వీట్లు ,గాల్లోకి కాల్పులు,
ఇక విజయ వర్గీయను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కూడ ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు..దీంతో ఉద్రిక్త వాతవారణం నడుమ ఎమ్మెల్యేలను జైలుకు కోర్టుకు తరలించారు.అనంతరం ఆయన్ను రిమాండ్‌కు పంపిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఇక నాలుగు రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన అనంతరం భోపాల్ ప్రత్యేక కోర్టు ఎమ్మెల్యేకు శనివారం బెయిల్ మంజూరు చేసింది..అయితే బెయిల్ మంజూరు కావడంతో విజయవర్గీయ అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు..జైలు నుండి విడుదల అయిన ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు..జైలు నుండి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు...ఈ సంధర్భంలోనే పెద్ద ఎత్తున స్వీట్లుకూడ పంచారు...ఇక ఈ స్వీట్లను స్థానికంగా విధుల్లో ఉన్న పోలీసులకు సైతం పంచారు.
తాను ఏమాత్రం సిగ్గు పడడం లేదు..ఎమ్మెల్యే
ఇక జైలు నుండి నేరుగా విజయ వర్గీయ పార్టీ కార్యాలయానికి వెళ్లారు...ఈనేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ అధికారిని బ్యాట్‌తో కొట్టడం ద్వార తాను ఏమాత్రం సిగ్గుపడడం లేదని చెప్పారు..ఎందుకంటే తాను ప్రజల కోసం అలా చేశాను తప్ప, వ్యక్తిగత కారణాలతో కాదని అన్నారు..ఈనేపథ్యంలోనే మరోసారి బ్యాట్ పట్టుకుని అధికారులను కొట్టే స్థితికి తీసుకురావద్దని భగవంతున్ని ప్రార్థించానని చెప్పారు.నియోజకవర్గ అభివృద్ది కోసం కట్టుబడి ఉంటానని అన్నారు.కాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏమాత్రం తప్పు చేశాననే ఆలోచనలో లేనని ,భాద్యయుతాంగానే తాను వ్యవహరించినట్టు ఎమ్మెల్యే చెప్పారు..ఇక ఆయన విడుదల సంధర్భంగా కార్యకర్తలు గాల్లోకి కాల్పులు జరిపారు.

ముందు రెక్వెస్ట్,వినకపోతే దాడులు, ఎమ్మెల్యే నినాదం..
ఇక జరిగిన సంఘనటపై పార్టీ హైకమండ్ సైతం స్పందించింది, పార్టీ అధ్యక్షుడు అమిత్ జరిగిన సంఘటన పూర్తి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు..మరోవైపు ఎమ్మెల్యే సైతం ముందు రెక్వేస్ట్ ఆ తర్వాత దాడాలు అనే నినాదం ఇవ్వడం రాష్ట్ర్ర వ్యాప్తంగా ఈకేసు సంచలనం రేగింది..పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి..అయినా బ్యాట్‌తో దాడి చేసిన ఎమ్మెల్యే మాత్రం ఎలాంటీ తప్పు చేయలేదనే ఫిలింగ్‌లో ఉండడం కొసమెరుపు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications