ఎట్టకేలకు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ఓఎంజీ 2. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నారాయన. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటించిన ఈ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది. దీని తరువాత ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ సినిమాలో నటించనున్నారు. ఇది కోల్ మైన్ ఇంజినీర్ జస్వంత్ సింగ్ గిల్ బయోపిక్.
బొగ్గు గనుల్లో చిక్కుకుపోయిన 64 మంది కార్మికులను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ క్యారెక్టర్‌ను అక్షయ్ కుమార్ పోషిస్తోన్నారు. దీని తరువాత కేసీ శంకరన్, సుధా కొంగర, అలీ అబ్బాస్ జాఫర్ సినిమాలు వరుసగా తెరకెక్కనున్నాయి. సాజిద్ నడియాడ్‌వాలా ఫ్రాంఛైజీ సీక్వెల్స్ హౌస్‌ఫుల్ 4, వెల్‌కమ్ 3, హేరా ఫేరీ 3 మూవీలకు సైన్ చేశారు.

వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న అక్షయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఆయనకు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని అందజేసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియజేశారు. కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
నిజానికి- అక్షయ్ కుమార్ పూర్తిస్థాయి భారతీయుడు కాదు. ఆయన కెనడియన్. కెనడా పౌరసత్వం ఉందాయనకు. కెనడా ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్‌తోనే భారత్‌లో నివసిస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్‌ను కూడా రెన్యూవల్ చేయించుకున్నారు. దీనితో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
భారత్‌లో ఉంటూ భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండకపోవడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఈ విమర్శలకు ఆయన సమాధానాలు, వివరణలను ఇస్తూ వచ్చారు. పౌరసత్వం లేనంత మాత్రాన తాను భారతీయుడిని కాదనుకోవట్లేదంటూ చెబుతూ వచ్చారు. తాను ఇక్కడే స్థిరపడ్డానని, ఇక్కడే సంపాదిస్తోన్నానని, అందులో కొంతమొత్తాన్ని సమాజానికి తిరిగి చెల్లిస్తోన్నానంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం లభించింది. ఆయన పూర్తిపేరు అక్షయ్ హరిఓం భాటియా పేరు మీద భారతీయ పౌరసత్వం మంజూరయింది. తండ్రి బ్రిజ్ మోహన్ భాటియా, తల్లి అరుణా భాటియా, భార్య డింపుల్ ఖన్నా పేర్లతో ఈ సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మంజరైనట్లు అక్షయ్ తెలిపారు.












Click it and Unblock the Notifications