Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో వైరల్ : ఆప్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేసిన అల్కా లాంబా

Recommended Video

    Delhi Assembly Elections 2020 : Alka Lamba Potches An AAP Worker @ A Polling Booth

    న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని మంజూ కా టిల్లా ప్రాంతంలో ఆప్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం సందర్భంగా అల్కా లాంబా కాంగ్రెస్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు.

    అల్కా లాంబా పై ఆప్ కార్యకర్త మాటల యుద్ధానికి దిగడంతో సహనం కోల్పోయిన లాంబా ఆప్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్కా లాంబా కొట్టేందుకు ప్రయత్నించగా ఆప్ కార్యకర్త పక్కకు జరిగి తప్పించుకున్నారు. వాగ్వాదాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆప్ కార్యకర్తను చుట్టుముట్టి పక్కకు తీసుకెళ్లారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆప్ కార్యకర్తపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులను దాటుకుని అతనిపై దాడి చేసే యత్నం చేశారు.

    పోలింగ్ స్టేషన్‌ నుంచి బయటకు రాగానే ఆప్ అభ్యర్థి కొడుకు పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండటం తాను చూశానని అదే సమయంలో తనపై పరుష పదజాలం వాడాడని అల్కా లాంబా చెప్పారు. అయితే పోలీసులు అతన్ని అరెస్టు చేయడాన్ని హర్షిస్తున్నట్లు అల్కా లాంబా చెప్పారు. ఆమ్‌ఆద్మీ పార్టీ టికెట్‌పై 2015లో అల్కా లాంబా చాందినీ చౌక్ నుంచి గెలిచారు.కేజ్రీవాల్‌తో విబేధాలు తలెత్తడంతో ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది అక్టోబర్‌లో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు అల్కా లాంబా 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఆ తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.

    Alka lamba tries to slap the AAP worker, Here is the video

    ఇదిలా ఉంటే 2019 సెప్టెంబర్ 19న ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అల్కాలాంబా పై అనర్హత వేటు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 1.7 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం రోజున వెలువడనున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+