లివింగ్ రిలేషన్ ఇక అఫీషియల్! హైకోర్టు సంచలన తీర్పు

ఆధునిక సమాజంలో 'సహజీవనం' (Living Relationship) అనేది ఒక వ్యక్తిగత ఇష్టం. కానీ, అది వివాహిత పురుషుడికి, మరో వయోజన మహిళకు మధ్య జరిగితే? సమాజం దీన్ని నైతికతతో ముడిపెట్టి చూస్తుంది. అయితే, న్యాయస్థానం మాత్రం ఇక్కడ ఒక స్పష్టమైన గీత గీసింది. "సామాజిక నైతికత వేరు.. చట్టం వేరు" అంటూ అలహాబాద్ హైకోర్టు మార్చి 27, 2026న ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాహితుడైన పురుషుడు మరో వయోజన మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అనమిక, నేత్రపాల్ అనే జంట తాము వయోజనులమని, ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తున్నామని కోర్టును ఆశ్రయించారు. అయితే నేత్రపాల్‌కు అప్పటికే వివాహం జరగడం, అనమికను అతను 'ప్రేరేపించి' తీసుకువెళ్లాడన్న ఆరోపణలతో ఆమె తల్లి కాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత - సెక్షన్ 87 కింద నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే. మునిర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల డివిజన్ బెంచ్, పిటిషనర్లకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Allahabad High Court Landmark Verdict Live-in Relation Between Married Man and Adult Woman is Not a Crime

నైతికత vs చట్టబద్ధత: కోర్టు క్లారిటీ!

ఈ కేసు విచారణలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పురుషుడు వివాహితుడు అయినంత మాత్రాన, మరో వయోజన మహిళతో, ఆమె సమ్మతితో కలిసి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.

"సమాజం దీన్ని అనైతికంగా చూడవచ్చు. కానీ, చట్టం దృష్టిలో ఇద్దరు వయోజనులు తమకు నచ్చినట్లు జీవించే హక్కును కలిగి ఉంటారు. ప్రజాభిప్రాయాలు లేదా సామాజిక విలువలతో న్యాయపరమైన చర్యలు ప్రభావితం కాకూడదు" అని ధర్మాసనం ఉద్ఘాటించింది.

పరువు హత్యల భయం.. పోలీసులకు చురకలు!

తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణాపాయం ఉందని, 'పరువు హత్య' (Honor Killing) జరిగే అవకాశం ఉందన్న జంట ఆందోళనను కోర్టు తీవ్రంగా పరిగణించింది. వారికి రక్షణ కల్పించడంలో విఫలమైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే ఆ జంటకు భద్రత కల్పించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 'శక్తి వాహిని' కేసు మార్గదర్శకాల ప్రకారం.. స్థానిక ఎస్పీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఆ జంటకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాకుండా, మహిళ కుటుంబ సభ్యులు ఆ జంట జీవితంలో జోక్యం చేసుకోవడం, ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా వేధించడం వంటివి చేయకూడదని గట్టిగా హెచ్చరించింది.

నేటి తరానికి ఒక సంకేతం..

ఈ తీర్పు లివింగ్ రిలేషన్‌లో ఉన్న వేలాది మందికి ఒక పెద్ద ఊరటనిచ్చింది. చట్టం అనేది సామాజిక కట్టుబాట్ల కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ప్రస్తుతానికి ఈ జంటకు అరెస్టు నుంచి రక్షణ లభించగా, తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+