వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేమీ చిత్రం.. అమరీందర్ సింగ్ ఓటమి, రెండుసార్లు సీఎం పదవీ చేపట్టి.. ఇలా

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో ఆప్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. చివరి సమయంలో సీఎంను మార్చడం.. అమరీందర్ సింగ్ పార్టీ వీడటం చకచకా జరిగిపోయాయి. అయితే తమ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ అనుకున్నాడు. కానీ ప్రజలు మార్పును కోరుకున్నారు . అయితే ఉద్దండులు కూడా ఓడిపోతున్నారు.

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఆప్‌కు చెందిన అజిత్ పాల్ సింగ్ కోహ్లి చేతిలో ఓడిపోయారు. 2017లో 49 శాతం ఓట్లతో విజయం సాధించిన ఆయన.. ఈసారి చతికిల పడ్డారు. పంజాబ్‌లో ఆప్ చరిత్ర సృష్టించింది. భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ విపక్షానికే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎం పదవీ తీయడంతో.. సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీని కూటమిగా ఏర్పాటు చేసి.. మరీ బరిలో దిగారు. అయినా కూటమిని జనం విశ్వసించలేదు. అమరీందర్ సింగ్ కూడా ఓడిపోయారు.

Amarinder Singh Loses In Patiala

Recommended Video

Punjab Election Results 2022 : తారుమారైన Exit Polls..ఏకపక్షంగా AAP | Oneindia Telugu

పంజాబ్‌లో చక్కం తిప్పాలని సిద్దూ అనుకున్నాడు. తమ పార్టీ విజయం తథ్యం అని అంచనా వేశారు. కానీ సిద్దూ వల్లే కాంగ్రెస్ ప్రభ తగ్గిందని విశ్లేషకులు అంటారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అమరీందర్‌తో పడలేదు. గత సెప్టెంబర్‌లో రాజీనామా కూడా చేసి హల్ చల్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమరీందర్ సింగ్‌ను సీఎం పదవీ నుంచి తప్పించారు. అప్పుడు పీసీసీ చీఫ్‌గా కొనసాగుతోన్న.. సీఎం పోస్టుపై మనసు ఉండేంది. ఇంతలో చన్నీని సీఎం చేయడంతో మింగలేక కక్కలేని పరిస్థితి. అలా ఎన్నికలకు వచ్చి.. గెలుద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు.

English summary
Former Punjab Chief Minister Amarinder Singh has lost in his Patiala Urban constituency. two-time Chief Minister lost to his AAP rival Ajit Pal Singh Kohli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X