శుభవార్త: ఐ ఫోన్ ఎస్ఈ 32 జీబీ రూ.17,999, అమెజాన్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: ఐ ఫోన్ కొత్త మోడల్స్‌ కొనుగోలుపై అమెజాన్ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. డిసెంబర్ 9వ, తేది వరకు అమెజాన్‌లో ఐ ఫోన్‌ కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్లు వర్తించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

ఐ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తిని చూపుతున్న వారికి అమెజాన్ మంచి ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ఉన్న సమయంలోనే ఐ ఫోన్‌ను కొనుగోలు చేస్తే సరసమైన ధరల్లోనే ఫోన్ దొరికే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐ ఫోన్ ఇటీవలనే కొత్త కొత్త మోడళ్ళను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడళ్ళను తక్కువ ధరకే అమెజాన్‌లో కొనుగోలు చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది.ఈ మేరకు నవంబర్ 30వ, తేది నుండి ఈ ఆఫర్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.

ఐ ఫోన్ మోడల్స్‌పై బంపర్ ఆఫర్లు

ఐ ఫోన్ మోడల్స్‌పై బంపర్ ఆఫర్లు

ఐ పోన్ మోడల్స్‌పై అమెజాన్ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎస్‌ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రవేశపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఈ ఐఫోన్లు కొనుగోలు చేసిన వారికి ప్రమోషనల్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాక ఈ కాలంలోనే అమెజాన్‌ పాత ఐఫోన్‌ మోడల్స్‌ ఎక్స్చేంజ్‌పై రూ.9500 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

 ఐ ఫోన్ ఎస్ఈ మోడల్. రూ. 18 వేలు

ఐ ఫోన్ ఎస్ఈ మోడల్. రూ. 18 వేలు

అమెజాన్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ 32జీబీ వేరియంట్‌ రూ.20,000కే లిస్టు అయింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరో రూ.2000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుంది.దీంతో ఐఫోన్‌ ఎస్‌ఈ కస్టమర్లకు రూ.18వేలకే అందుబాటులోకి వచ్చింది.అదేవిధంగా ఐఫోన్‌ ఎస్‌ఈ 16జీబీ వేరియంట్‌ కూడా ఐఫోన్‌ ఫెస్ట్‌ సేల్‌ సందర్భంగా రూ.18,990కే లభ్యమవుతోంది.

ఐ ఫోన్ 7 రూ. 41 వేలు

ఐ ఫోన్ 7 రూ. 41 వేలు

ఐ ఫోన్ 7 రూ.41 వేలకు విక్రయిస్తున్నారు. ఐఫోన్‌ 6 ఎస్ ‌ను రూ.35వేలకు అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. ఐఫోన్‌ 6 ధర రూ.26వేలుగా నిర్ణయించారు. ఐఫోన్‌ 8 ప్లస్‌ 64జీబీ వేరియంట్‌ను రూ.69,685కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిసెంబర్ 9 వరకే

డిసెంబర్ 9 వరకే

నవంబర్ 30వ, తేదిన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఆఫర్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 9వ, తేదివరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్‌ 8 64జీబీ వేరియంట్‌ను రూ.58,999కు విక్రయిస్తున్నారు. ఐ ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+