చెంప దెబ్బ పడితే.. నెట్ వర్క్ దారిలోకి వచ్చేది.. 4జీ, 5జీలపై బిగ్‌బీ సెటైర్

ముంబై: ఈ మధ్యకాలంలో తరచూ వినిపించే పేర్లు 3జీ, 4జీ..5జీ. ఈ జనరేషన్ లో యువత పఠించే మంత్రం ఇది. వారి ఆలోచనలన్నీ దీని చుట్టే. మొన్నటిదాకా 3జీ, ఇఫ్పుడు 4జీ ఇక 5జీ కోసం ఎదురు చూపులు. అది చేతికి అందిన తరువాత ఇంకోటి. ఇలా ఎక్కువ సార్లు 4జీ, 5జీ టెక్నాలజీ గురించే మాట్లాడుకోవడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో చురకలు వేశారు. కనిపించని 3జీ, 4జీ, 5జీల ధ్వాసలో పడి కళ్లముందు ఉండే మాతాజీ, పితాజీ, గురూజీలను విస్మరిస్తున్నారని అన్నారు. దీని గురించి ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఓ కామెంట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.

సాంకేతిక విప్లవం మంచిదే అయినప్పటికీ.. అది కుటుంబ బాంధవ్యాలను ధ్వంసం చేసేదిగా ఉండకూడదని చెప్పారు. తమ కాలంలో మాతాజీ, పితాజీ, గురూజీ తప్ప.. ఈ 3జీ, 4జీలు ఉండేవి కావని చెప్పారు. ఇప్పుడు కూడా మాతాజీ, పితాజీ ఉన్నప్పటికీ.. వారి మాటలను పట్టించుకోవట్లేదని, పెద్దలు చెప్పే సూచనలకు బదులుగా 3జీ, 4జీ ద్వారా అందే సమాచారం మీదే అధికంగా దృష్టి పెడుతున్నారని అన్నారు. మాతాజీ, గురూజీల నుంచి ఒక్క చెంప దెబ్బ పడితే మన నెట్ వర్క్ దారిలోకి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు.

Amitabh Bachchan shares hilarious joke on 3G and 4G connections. Internet cannot stop laughing

అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. అమితాబ్ చెప్పిన విషయాలు నేటి యువతకు అతికినట్టు సరిపోతాయంటూ బదులిస్తున్నారు. బిగ్ బీ చేసిన ఆ ఒక్క కామెంట్ కు కొన్ని గంటల వ్యవధిలో 70 వేలకు పైగా లైక్స్ పడ్డాయి. ఆరువేల మందికి పైగా నెటిజన్లు రీ ట్వీట్ చేశారు. అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఈ జనరేషన్ యూత్ కు చెంపదెబ్బగా అభివర్ణిస్తున్నారు. వారు కూడా హిలేరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ సామాజిక సమస్యను అమితాబ్ తనదైన శైలిలో వర్ణించడం గొప్ప విషయమని, నేటి యువతరానికి అర్థమయ్యేలా చురకలు అంటించారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+