ఒకే పళ్లెం.. ఒకే మంచం: జయలలితతో అమృత అనుబంధమిలా!, అవే సాక్ష్యం..

Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత కడుపున పుట్టిన బిడ్డగా తెర పైకి వచ్చిన అమృత.. తన వారసత్వాన్ని నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రతికూలత ఎదురైనా.. కర్ణాటక హైకోర్టు మెట్లెక్కడానికి సన్నద్దమవుతున్నారు.

  Jayalalitha Daughter:Jayalalitha's Letter on Relationship With Shobhan Babu

  ఈ నేపథ్యంలో అమ్మతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమ్మతో ఎలా గడిపింది?.. ఆమె మరణానికి ముందు చివరి సమయంలో ఏం మాట్లాడింది?.. వంటి విషయాలను తాజాగా మీడియాతో పంచుకున్నారు.

  ఒక పళ్లెం.. ఒకే మంచం:

  ఒక పళ్లెం.. ఒకే మంచం:

  1996తర్వాత తాను చాలాసార్లు జయలలితను కలిశానని అమృత తెలిపారు. తాను వెళ్లినప్పుడల్లా అమ్మ చూపిన ఆప్యాయతను ఎప్పటికీ గుర్తుచేసుకుంటానన్నారు. అమ్మతో ఎప్పుడూ గడిపినా.. ఇద్దరం ఒకే పళ్లెంలో తిని.. ఒకే మంచంపై నిద్రపోయేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.

  క్షేమంగా ఉండు:

  క్షేమంగా ఉండు:

  అమ్మను కలిసేందుకు సెక్రటేరియట్ కు వెళ్లిన ప్రతీసారి క్షేమంగా ఉండాలంటూ తనను ఆశీర్వదించేవారని భావోద్వేగంగా చెప్పారు. ఎక్కడున్నా సరే.. క్షేమంగా ప్రాణాలతో ఉండు అని అంటుండేవారని చెప్పుకొచ్చారు.

  వాళ్లూ.. వీళ్లూ కాదు.. జయలలితే స్వయంగా!: శోభన్ బాబుతో సహజీవనంపై అమ్మ రాసిన లేఖ ఇది..

  రావద్దన్నారు:

  రావద్దన్నారు:

  అమ్మకు ఆరోగ్యం బాగా లేని సమయంలో ఆమెను చూసేందుకు ప్రయత్నించిన కుదరలేదన్నారు అమృత. ఫోన్ చేసి తాను వస్తున్నానని చెబితే రావదన్నారని తెలిపారు. తాను ఇంట్లో ఉండట్లేదని తనతో చెప్పారని, వేద నిలయంలో కనుక్కుంటే ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందని అన్నారు.

  నేను జయలలిత, శోభన్ బాబుల కొడుకును: ఇదే సాక్ష్యం, మాయం, ఎంజీఆర్!

  అవి చూస్తే తెలుస్తుంది:

  అవి చూస్తే తెలుస్తుంది:

  తాను జయలలితను చాలాసార్లు కలిశానన్న దానికి సీసీ టీవి ఫుటేజీలే సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు. జెడ్ కేటగిరీ రిజిస్టర్ ను పరిశీలించినా ఈ విషయం బహిర్గతమవుతుందని తెలిపారు. అమ్మను కలవకుండా శశికళ తనను చాలాసార్లు అడ్డుకున్నారని ఈ సందర్భంగా అమృత ఆరోపించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Amrutha, who is claiming that she was the biological daughter of late Tamil Nadu Chief Minister Jayalalithaa has remembered her relationship with Amma.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి