కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు: ఎన్‌కౌంటర్- జవాన్ వీరమరణం
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న తరువాత భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి. నిఘా పెంచాయి. అన్ని సెక్టార్‌లలో అదనపు పారా మిలటరీ బలగాలు, బీఎస్ఎఫ్ జవాన్లను మోహరింపజేశారు.
ఈ క్రమంలో బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్, రెండు ఏకే 47 రైఫిళ్లను జవాన్లు సీజ్ చేశారు. వాటిపై ఉన్న మార్క్‌ల ఆధారంగా ఈ ఇద్దరు చొరబాటుదారులు కూడా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. పహల్గామ్ నరమేధం అనంతరం జమ్మూ కాశ్మీర్‌కు మారణాయుధాలను చేరవేయడానికి ప్రయత్నించి ఉండొచ్చని భావిస్తోన్నారు.
నేడు ఉధంపూర్ జిల్లాలో తాజాగా ఆర్మీ జవాన్లు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లాలోని దుదు-బసంత్‌గఢ్ ఏరియాలో కార్ప్స్ 9, కార్ప్స్ 16, వైట్ నైట్ కార్ప్స్ విభాగాలకు చెందిన జవాన్లు ఈ కార్డెన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. అణువణువూ గాలిస్తోన్నారు.
ఆ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతిగా జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. రెండు గంటలుగా వీరి మధ్య భీకరంగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.
మరోవంక- కుల్గామ్ సమీపంలోని తంగ్‌మార్గ్ అడవుల్లో కూడా ఆర్మీ జవాన్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేశారంటూ పక్కా సమాచారం అందడంతో భారీ ఎత్తున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తోన్నారు. ఇదే ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్ మొత్తం దాదాపుగా నిర్మానుష్యంగా మారింది. మొన్నటివరకు వేలమంది సందర్శకులతో కళకళలాడిన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బోసిపోయాయి. దాల్ లేక్‌లో బోట్ హౌస్‌లు స్తబ్దుగా ఉంటోన్నాయి. పహల్గామ్‌లో బయటి వ్యక్తులెవరూ ఉండట్లేదు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications