అర్దరాత్రి ఆటోలో మహిళను పిలుచుకుని వెళ్లిన డ్రైవర్ ఏం చేశాడంటే ?, మేడ మీద నుంచి !
గుర్తు తెలియని మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి పరారైన ఆటో డ్రైవర్‌ను బెంగళూరులోని సంపంగిరామనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులోని అంజనప్ప గార్డెన్‌కు చెందిన ముబారక్ (38) అరెస్టు అయిన నిందితుడు. మహిళను అర్దరాత్రి పక్కాప్లాన్ తో పిలుచుకుని వెళ్లి ఆమె మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ముబారక్ తప్పించుకున్నాడు.
ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం బెంగళూరులోని కేహెచ్ రోడ్డులో నిర్మాణ దశలో ఉన్న భవనంలో 25 ఏళ్ల యువతి మృతదేహం గుర్తించిన ప్రజలు ఇచ్చిన సమాచారంతో సంపంగిరామనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మహిళ చనిపోయిందని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా. దుండగులు ఆమె మీద అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తరువాత అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కేసును ఛేదించి ఆటోడ్రైవర్ ముబారక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

కేఆర్ మార్కెట్ లో పికప్ : నిందితుడు ముబారక్ ఫిబ్రవరి 20వ తేదీన అర్థరాత్రి కేఆర్ మార్కెట్ సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళను పరిచయం చేసుకుని అతని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత సుమారు రెండు గంటల పాటు నగరంలో తిరుగుతూ ఆమెకు మాయమాటలు చెప్పాడని తెలిసింది. తరువాత సంపంగిరామనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేహెచ్ రోడ్డులోని నిర్జనప్రదేశం సమీంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని మొదటి అంతస్తులోకి మహిళను తీసుకెళ్లాడు.
అనంతరం ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి తరువాత ఆమెను మొదటి అంతస్తు నుంచి కిందకు తోసి పారిపోయాడు. మహిళ తలకు బలమైన గాయం కావడంతో అక్కడే కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎవరూ లేరని పోలీసులు అన్నారు. గత ఐదేళ్లుగా ఈ భవనం పనులు సగంలో నిలిచిపోయాయి. అందువల్ల ఆ భవనంలో ఎవ్వరూ లేరని, అంతే కాకుండా ఆ భాగంలో ప్రజల రద్దీ తక్కువగా ఉంటుందని పోలీసులు అన్నారు.

మరుసటి రోజు ఉదయం భవనం కింద పడి ఉన్న మహిళ మృతదేహాన్ని బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో మహిళపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంపంగిరామనగర్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
హత్యకు గురైన మహిళ పేరు, చిరునామా తెలియడం లేదని, ఆమెకు దాదాపు 25 ఏళ్లు ఉండొచ్చు అని, ఈ ఘటన చూస్తుంటే ఆమె సెక్స్ వర్కర్ లా కనిపిస్తోందని పోలీసులు అన్నారు. మహిళ వారసులు దొరకకపోవడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గతంలో ఆటో డ్రైవర్ ముబారక్ ఇలా ఇంకా ఎవరినైనా హత్య చేశాడా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications