కార్పోరేట్ కంపెనీలో కులం పేరుతో ?, అవమానంతో వీడియో యూట్యూబ్ లో పెట్టి !

బెంగళూరు: బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో 35 ఏళ్ల దళిత ఉద్యోగి తాను కుల వివక్షకు గురౌతున్ననానని, కంపెనీలో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అతని ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళితుడు వివేక్ రాజ్ ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో కలకలం రేపింది.

తాను ఇకపై నా కులం గురించి సాటి ఉద్యోగులతో పోరాడలేనని వివేక్ రాజ్ ఆ వీడియోలో చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని కప్తంగంజ్ బస్తీకి చెందిన వివేక్ రాజ్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రిపబ్లిక్ ఆఫ్ వైట్‌ఫీల్డ్‌లో నివసించాడు. Lifestyle International Pvtలో వివేక్ రాజ్ ఉద్యోగంలో చేరాడు. ఇదే కంపెనీలో తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ వివేక్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు.

An employee of a corporate company in Bengaluru committed suicide because of caste abuse.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడారు. మా మాజీ ఉద్యోగి మృతి చెందడం మాకు చాలా బాధ కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో అతని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము. మా అంతర్గత కమిటీకి వివేక్ ఫిర్యాదు చేసారు. కంపెనీ విధానాలకు అనుగుణంగా సమగ్ర అంతర్గత విచారణ జరుగుతోందని అన్నారు.

పోలీసులు వివేక్ రాజ్ ఆత్మహత్య కేసు విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, మేము పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. వివేక్ రాజ్ మృతిపై అతని తండ్రి రాజ్ కుమార్ జూన్ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేక్ రాజ్ ఆత్మహత్య చేసుకునే ముందు అతను నాకు రెండుసార్లు జూన్ 3వ తేదీన ఫోన్ చేసాడని, కానీ అతని పరిస్థితి గురించి ఏమీ చెప్పలేదని, కొన్ని సాధారణ విషయాలు మరియు నా ఆరోగ్యం గురించి మాత్రమే అడిగాడని వివేక్ రాజ్ తండ్రి రాజ్ కుమార్ పోలీసులకు చెప్పారు.

నేను 20 సంవత్సరాల క్రితం నా భార్యను కోల్పోయాను, నా కొడుకు వివేక్ రాజ్ నాకు సర్వస్వం, అతని చదువు కోసం నేను అన్నీ చేసాను. ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవడంతో నేను జీవితాంతం ఒంటరిగా జీవించాలని రాజ్ కుమర్ పోలీసుల ముందు విలపించారు. వైట్‌ఫీల్డ్ పోలీసులు వివేక్ రాజ్ ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని పలు సెక్షల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

జూన్ 3వ తేదీ నాటి వీడియోలో కొంతమంది సహోద్యోగులు తనను వేధిస్తున్నారని, తాను గతంలో కొన్ని సమస్యలను లేవనెత్తినందుకు అలా చేశారని వివేక్ రాజ్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు, అతను తన ముగ్గురు సహోద్యోగులపై మారతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యింది. కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులు తనను కులం పేరుతో దూషిస్తున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని వివేక్ రాజ్ ఫిర్యాదులో పోలీసులకు మనవి చేశారు.

An employee of a corporate company in Bengaluru committed suicide because of caste abuse.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వివేక్ తన కంపెనీ హెచ్‌ఆర్‌తో కుల వివక్ష సమస్యను లేవనెత్తాడు, కాని ఫలితం లేకుండా పోయింది. తర్వాత అతను మారతహళ్లి పోలీసులను ఆశ్రయించాడు, అయితే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోక్యం చేసుకునే వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆరోపణలు ఉన్నాయి.

జూన్ 18వ తేదీలోపు నువ్వు ఉద్యోగం మానేయాలని వివేక్ రాజ్ కు అతను పని చేస్తున్న కార్యాలయం కొంత సమయం ఇచ్చిందని, అతను ఫిర్యాదు చేసినందున నిష్క్రమించమని చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివేక్ రాజ్ కేసు పెట్టిన ఇద్దరూ సహచరులు బెయిల్ పొందారని, ఎఫ్ఐఆర్ నుండి తమ పేర్లను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారని తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న వివేక్ రాజ్ సహోద్యోగిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+