నడిరోడ్డులో కాలేజ్ అమ్మాయిని కత్తితో పొడిచేసిన మాజీ బాయ్ ఫ్రెండ్ !
చెన్నై: కాలేజ్ లో చదువుతున్న యువతి బాగా చదువుకోవాలని అనుకుంది. కుమార్తెను బాగా చదివించి ఉద్యోగం చేస్తుంటే చూడాలని, మంచి యువకుడిని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి కాలేజ్ కు వెలుతున్న యువతి కాలేజ్ పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతోంది.
ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్లు మార్చుకున్న యువకుడు, కాలేజ్ అమ్మాయి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు. రానురాను కాలేజ్ అమ్మాయి స్నేహం ఆ యువకుడితో ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకుని హ్యాపీగా చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ప్రియురాలిని ఆమె ప్రియుడు నడిరోడ్డులో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

తరువాత ప్యాంట్ లో ముందుగా దాచుకున్న కత్తితో విద్యార్థిని మెడపై ఇష్టం వచ్చినట్లు పొడిచిన నవీన్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రక్తపు మడుగులో పడిపోవడంతో స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు నవీన్‌ను దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వెంబడించి పట్టుకున్నారు.

పోలీసులు పట్టుకున్న తరువాత నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. అయితే పోలీసులు నవీన్ ముఖం నీళ్లు చల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాలేజ్ విద్యార్థినిపై నవీన్ కత్తితో దాడి ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. తనను ప్రేమించి ఇంతకాలం తనతో తిరిగి ఇప్పుడు తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేయాలని అనుకున్నానని నవీన్ చెప్పాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications