పీహెచ్ డీ అమ్మాయి మిస్సింగ్, వారం తర్వాత స్కూటర్ ప్రత్యకం, పీజీలో ముస్లీం యువకుడితో ?
పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థిని ఎనిమిది రోజుల క్రితం అదృశ్యం కావడంతో ఆమె వెనుక లవ్ జిహాద్ స్కెచ్ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిస్సింగ్ కేసు నమోదైన 8 రోజుల తర్వాత కూడా యువతి ఆచూకి చిక్కకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోందని, డ్రగ్స్ మాఫియా, లవ్ జీహాద్ కారణంగానే ఆ యువతిని కిడ్నాప్ చేసి ఉంటారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని సూరత్‌కల్ సమీపంలో పీహెచ్ డీ విద్యార్థిని ఉపయోగిస్తున్న యాక్టివా స్కూటర్ లభ్యమైంది. పుత్తూరుకు చెందిన సతీష్ హెబ్బార్ కుమార్తె చైత్రా హెబ్బార్ (27) అనే యువతి వారం రోజుల క్రితం సినిమా ఫక్కీలో అదృశ్యమైంది. కోటేకారు మడూరు సమీపంలోని పీజీలో ఉంటున్న చైత్రా ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తోంది.

ఫిబ్రవరి 17వ తేదీన పీజీలో టిఫిన్ తిన్న చైత్రా తరువాత కాలేజీకి బయలుదేరింది. అయితే చైత్రా కాలేజ్ కు వెళ్లకుండా అదృశ్యం అయ్యింది. మడూరులోని చైత్రా ఉంటున్న ఈ పీజీకి పుత్తూరుకు చెందిన ఓ ముస్లిం యువకుడు వచ్చి వెళ్లేవాడని వెలుగు చూసింది. 10 రోజుల క్రితం స్థానికులు ఈ విషయాన్ని భజరంగ్ దళ్ దృష్టికి తీసుకెళ్లారు. పీజీ గురించి ఆరా తీస్తే కేవలం హిందూ విద్యార్థినులు ఉంటున్న పీజీలోనే ముస్లీం అయిన అతడు కూడా ఉంటున్నాడని తేలిందని బజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై చైత్రా ఆమె మామ ప్రకాష్ హెబ్బార్ ఉల్లాల్ పోలీస్ స్టేషన్‌లో మా అమ్మాయి కనపడటంలేదని మిస్సింగ్ కేసు పెట్టారు చైత్రా ఉపయోగిస్తున్న యాక్టివా స్కూటర్ 8 రోజుల తర్వాత ఆదివారం సూరత్కల్ సమీపంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైత్రాతో సన్నిహితంగా ఉంటున్న ముస్లీం
యువకుడు డ్రగ్స్ వ్యాపారి అనే అనుమానంతో చైత్రాను లవ్ జీహాద్ ఉచ్చులోకి దింపి ఉంటాడని ఆమె బందువులు, హిందూ సంఘాలు అనుమానిస్తున్నారు.
తరువాత బజరంగ్ దళ్ నాయకులు చైత్రా మామను సంప్రదించి సమాచారం అందించారు. ఇదే విషయమై చైత్రాను ఆమె మామ ప్రశ్నించిన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తేదీన చైత్రా హఠాత్తుగా అదృశ్యమైంది. చైత్రాను ముస్లీం యువకుడే అపహరించి ఉండొచ్చని ఆమె బందువులు ఆరోపిస్తున్నారు. దీనిపై విలేకరులతో మాట్లాడిన బజరంగ్ దళ్ ఉల్లాల్ చీఫ్ ఆర్గనైజర్ అర్జున్ మదుర్ ముస్లీం యువకుడే ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని ఆరోపించారు. ముస్లీం యువకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, మూడు రోజుల్లో యువతి ఆచూకీ లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పోలీసు అధికారులను బజరంగ్ దళ్ నాయకులు హెచ్చరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications