Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అపార్ట్ మెంట్ 13వ అంతస్తు నుంచి దూకిన కాలేజ్ అమ్మాయి, తండ్రికి దూరంగా తల్లి, కానీ !

బెంగళూరు: ఇంటర్ (inter)చదువుతున్న అమ్మాయి ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు నరంలో కలకలం రేపింది. బెంగళూరులోని (bengaluru) బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంటన చోటుచేసుకుంది.
బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్‌కు చెందిన విజయలక్ష్మి(17) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అన్నారు.

సాయంత్రం బెంగళూరు (bengaluru)నగరంలోని నాయండహళ్లి రోడ్డులోని బీహెచ్‌ఈఎల్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తు నుంచి దూకిన విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే మరుసటి రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. కాలేజ్ అమ్మాయి విజయలక్ష్మి ఆమె తల్లి యశోధతో కలిసి బెంగళూరులోని (bengaluru) నాగరబావి సమీపంలోని జ్ఞానజ్యోతి నగర్‌లో నివాసం ఉంటోంది.

An inter-college girl committed suicide by jumping from the 13th floor of an apartment in Bengaluru city.

బెంగళూరు (bengaluru)నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో (college) పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విజయలక్ష్మి తాను కళాశాలకు వెళతానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ కాలేజీకి (bengaluru)వెళ్లకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కిన విజయలక్ష్మి నేరుగా ధర్మస్థలానికి వెళ్లింది. ధర్మస్థలంలోని బస్టాండ్‌లో విజయలక్ష్మి నిలబడి ఉండటాన్ని గమనించిన హరీష్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు.

ఈ సమయంలో తాను ఇంటి నుండి వచ్చేశాననే విషయం హరీష్ కు చెప్పింది. తరువాత హరీష్ ఆమెకు బుద్దిమాటలు చెప్పి ఇలా చెయ్యకూడదని, నీకు ఏదైనా అవసరం వస్తే తనకు ఫోన్ చెయ్యాలని ఓ పేపర్ మీద అతని ఫోన్ నెంబర్ రాసిన హరీష్ కాలేజ్ అమ్మాయి విజయలక్ష్మిని బెంగళూరుకు (bengaluru) కేఎస్ఆర్ టీసీ బస్సులో పంపించాడని తెలిసింది.

An inter-college girl committed suicide by jumping from the 13th floor of an apartment in Bengaluru city.

బెంగళూరు (bengaluru) చేరుకున్న కాలేజ్ అమ్మాయి తరువాత సాయంత్రం నాయండహళ్లి రోడ్డులోని బీహెచ్‌ఈఎల్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌కు (apartment) వెళ్లింది. గేటు వద్ద సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని ఆపి ప్రశ్నించగా మా బంధువులు 13వ అంతస్తులో ఉన్నారని, అక్కడికి వెళ్లాలని చెప్పింది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు 13వ అంతస్తులో నివాసముంటున్న (apartment) వారికి ఫోన్ చేయగా పరిచయస్తులు ఉండే అవకాశం ఉన్నందున లోపలికి పంపాలని సెక్యూరిటీ గార్డులకు చెప్పారు.

దీంతో సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని అపార్ట్‌మెంట్‌లోకి (apartment)అనుమతించారు. ఈ సమయంలో విజయలక్ష్మి 13వ అంతస్తులోకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పడిపోయిన స్థలం ఇరుకుగా ఉండడంతో ఆ సమయంలో మృతదేహాన్ని ఎవరూ గమనించలేదని తెలిసింది. మరుసటి రోజు సాయంత్రం అపార్ట్ మెంట్ లో (apartment)నివాసం ఉంటున్న కొందరు వాకింగ్ చేస్తుండగా విజయలక్ష్మి శవం గమనించి పోలీసులకు (bengaluru)సమాచారం అందించారు.

An inter-college girl committed suicide by jumping from the 13th floor of an apartment in Bengaluru city.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయలక్ష్మి కాలేజీ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించగా ఆమె గుర్తింపు, చిరునామా లభ్యమయ్యాయి. ఆమె దగ్గర ఉన్న పేపర్ లోని మొబైల్ (bengaluru)నంబర్‌కు కాల్ చేయగా ధర్మస్థలానికి చెందిన హరీష్ అనే వ్యక్తి కాల్‌కు సమాధానం ఇచ్చాడు. విజయలక్ష్మి ధర్మస్థలానికి వచ్చిందని, తానే ఆమెను బెంగళూరుకు (bengaluru) తిరిగి బస్సు ఎక్కించినట్లు హరీష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ అపార్ట్‌మెంట్‌లో (apartment) నివాసం ఉంటున్న ఎవ్వరూ విజయలక్ష్మికి తెలీదని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. విజయలక్ష్మి మొబైల్ వాడటం లేదని, ఆమె అపార్ట్‌మెంట్‌కు (apartment) చేరుకోగానే సెక్యూరిటీ గార్డు మొబైల్‌ ఆమె తండ్రికి కాల్ చేసిందని, ఈ సమయంలో ఫోన్ కనెక్ట్ కాలేదని తెలిసింది. తరువాత అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి 13వ అంతస్తుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు (bengaluru)తెలిపారు.

విజయలక్ష్మి తల్లిదండ్రులు విడిపోయి వేర్వేరుగా (bengaluru)ఉంటున్నారని, విజయలక్ష్మి ఆమె తల్లి (mother) వద్దే ఉంటోందని, కాలేజీలో చాలా మందితో కలసిమెలసి ఉండకుండా విజయలక్ష్మి అందరికి దూరంగా ఉంటోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే కాలేజ్ అమ్మాయి విజయలక్ష్మి 13వ అంతస్తు మీద (apartment)నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+