విదేశాల్లో ఎంబీబీఎస్ చెయ్యరా అంటే వీడు ఏం చేశాడంటే ?, బురఖా అమ్మాయితో !
బెంగళూరు: రెండుసార్లు ఇంటర్ ఫెయిల్ అయిన యువకుడు చివరికి కష్టపడి పాస్ అయ్యాడు. వేరే దేశంలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ కష్టపడుతున్నాడు. అనుకున్నట్లు జరిగి ఉంటే విదేశాల్లో చదివితే డాక్టర్ అయ్యేవాడు. కానీ సెలవుల మీద బెంగుళూరు వచ్చి మోరల్ పోలీస్ దందా చూపించిన ఆ యువకుడు ఇప్పుడు ఖైదీ అయ్యాడు.
విదేశాల్లో చదివి మంచి జీవితం గడపాలనుకునే వ్యక్తి మోరల్ పోలీస్ చేస్తూ కటకటాలపాలవుతాడని అతని కుటుంబ సభ్యులు ఊహించలేకపోయారు. మోరల్ పోలీసు పని చేయడమే కాకుండా యువతి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి లైక్ కామెంట్స్ చేస్తూ అతని భవిష్యత్తును అతనే సర్వనాశనం చేసుకున్నాడు.

నిన్న సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. బురఖా ధరించి స్నేహితుడితో వెళ్తున్న ఓ ముస్లీం యువతిని అడ్డుకున్న జాకీర్ అహ్మద్ అనే యువకుడు ఆ ముస్లీం యువతిని అనరాని మాటలతో దుర్భాషలాడుతూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. నడిరోడ్డు మీద బురఖా వేసుకుని వెలుతున్న ముస్లీం యువతిని ఆమె స్నేహితుడిని బూతులు తిట్టాడు.
వేరే కులం, మతం యువకుడితో నువ్వు కలిసి తిరుగుతున్నావా ?, ముస్లిం యువతి అయిన నువ్వు ఇలాంటి సిగ్గుమాలిన పని చేస్తావా అంటూ ఆ యువతిని అనరాని మాటలతో బూతులు తిట్టాడు. ఇంతటితో సైలెంట్ గా ఉండకుండా జాకీర్ అహ్మద్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని గోవిందపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఇలా ముస్లీం యువతితో స్వరం పెంచి అనుచితంగా ప్రవర్తించిన జకీర్ అహ్మద్ ను బెంగళూరు తూర్పు డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన జాకీర్ అహ్మద్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదివుతున్నాడు. నిందితుడు జాకీర్ సెలవుపై బెంగళూరులోని గోవిందపురలో నివాసం ఉంటున్న అతని అక్క ఇంటికి వచ్చాడు.
బెంగుళూరు వచ్చిన జాకిర్ అహ్మద్ ఇలాంటి పాడుపని చేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. సోమవారం స్నేహితుడితో కలిసి రోడ్డుపక్కన నడిచి వెలుతున్న ముస్లీం యువతిని అవమానించిన జాకీర్ ఆమెను అందరి ముందు బూతులు తిట్టాడు. ఆ సమయంలో వీడియో తీసిన జాకీర్ దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం, కొన్ని గంటల్లో ఆ వీడియో వైరల్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. బాధితురాలు బెంగళూరు తూర్పు డివిజన్‌లోని సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది, ఇప్పుడు నిందితుడు జాకీర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications