Anand Mahindra: మహీంద్రా మెచ్చిన సోషల్ మీడియా సంచలనం.. ఫుడ్ వెండర్ ఆన్సర్‌కు బిజినెస్ టైకూన్ ఫిదా
Chennai food vendor: మన దేశంలో మట్టిలో మాణిక్యాలకు కొదువ లేదు. అటుంవటి వారిని గుర్తించి ప్రోత్సహించడంలో భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముందుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్.. పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్‌లో పనిచేస్తున్న PhD స్టూడెంట్‌ని తన వీడియోలో పరిచయం చేశాడు. దీనికి సంబంధించిన వైరల్ వీడియోను బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో PhD స్కాలర్ అయిన చెన్నై విక్రేత రేయాన్, తన పరిశోధనా పత్రాలను ఆన్‌లైన్‌లో గర్వంగా ఎలా చూపించాడో వీక్షించండి అంటూ ఫాలోవర్స్‌కు సూచించారు.

This clip went viral a while ago.
— anand mahindra (@anandmahindra) October 4, 2024
An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.
What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG
రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అతడిని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి ప్రస్తావించగా వాటికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్‌లైన్‌లో చూపించడాన్ని ప్రశంసించారు. అతడి ఆలోచనా విధానం తనకు నచ్చిందని, ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన ఆ విక్రేతపై సోషల్ మీడియా వినియోగదారులు పొగడ్తలు కురిపిస్తున్నారు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో విజయం సాధించడం అంటే పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రమే కాదని, అభిరుచితో పనిచేయడమని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల కంటే తన పరిశోధన గురించి గర్వంగా చెప్పుకోవడం తన కృషి మరియు పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసిస్తున్నారు. అయితే అతడి ఆశయానికి తగిన పరిస్థితులను కల్పించడంలో దేశం, సిస్టమ్ విఫలమయ్యాయని మరికొందరు పేర్కొంటున్నారు.
-
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications