అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి: రజినీ, మహేశ్ సహా హాజరైన ప్రముఖులు

ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం కన్నుల పండవగా కొనసాగుతోంది. అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, బంధువులతోపాటు రాజకీయ నాయకులు, భారత సినీ ప్రముఖులతోపాటు హాలీవుడ్ తారలు, క్రికెటర్లు, క్రీడాకారులు కూడా ఈ వేడుకలో మెరిశారు.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ వివాహ సంబరాల్లో దేశ విదేశాలకుచెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. హీరో రాంచరణ్ దంపతులు, హీరో వెంకటేశ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబం సహా హాజరయ్యారు.

Anant Ambani tie knot with Radhika Merchant from tollywood to hollywood celebs sportspersons attended

కాగా, రజనీకాంత్ ఈ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పెళ్లికొడుకు అనంత్‌తో కలిసి రజనీ చిందేశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా రజనీతో కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిగితా సినీతారలు కూడా ఈ వివాహ వేడుకలో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

Anant Ambani tie knot with Radhika Merchant from tollywood to hollywood celebs sportspersons attended

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పరిణయ మహోత్సవ వేడుకలకు ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా, నిక్ జొనాస్-ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత్ ఖాన్, సూర్య, జ్యోతిక, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నిధి అగర్వాల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, వికీ కౌశల్, ధోనీ, సాక్షి, జివా, జాకీ ష్రాఫ్, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, సునీల్ శెట్టి, అహాన్ శెట్టి తదితరులు హాజరయ్యారు.

టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారి వారి కుటుంబంతో సహా హాజరయ్యారు. అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే కర్దాషియాన్, బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా అనంత్-రాధికల వివాహక వేడుకకు హాజరయ్యారు. మరోవైపు, వివాహ వేడుకకు వచ్చిన అతిథుల కోసం వేలాది వంటకాలు సిద్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+