Ola News: ఆగ్రహంతో ఊగిపోయిన ఓలా బైక్ కస్టమర్.. షోరూం ముందు పిచ్చ కొట్టుడే..
Angry with Ola bike: రైడ్ షేరింగ్ సంస్థగా ప్రయాణం ప్రారంభించిన ఓలా క్రమంగా పలు ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించింది. ఎలక్ట్రిక్ బైక్ తయారీ మొదలుపెట్టి ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రణాళిక రచించుకుంది. అయితే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ఇటీవల పలుమార్లు ఓలా బైక్ కొనుగోలు చేసిన యజమానులు ఆగ్రహమే ఇందుకు ఉదాహరణ.
బైక్ డీలర్లు ఓలా బైక్‌ను విక్రయించేటప్పుడు దాని అద్భుతమైన ఫీచర్లను వివరించి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం నరకం చూడాల్సి వస్తుందని విక్రేతలు వాపోతున్నారు. సర్వీసింగ్ కోసం అధిక సమయం తీసుకోవడం, స్పేర్ పార్ట్స్ అందుబాటు, నాసిరకం విడిభాగాలతో తమ ప్రతిష్ఠను వారే దిగజార్చుకుంటున్నారనే మాటలు బైక్ యజమానుల నుంచి వినిపిస్తున్నాయి.

గతంలో ఓలా బైక్‌కి చెప్పుల దండ వేసి ఊరేగించగా, ఇటీవల తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ కస్టమర్ ఏకంగా షోరూమ్‌కే నిప్పుపెట్టాడు. కాగా ఇప్పుడు మరో కస్టమర్ స్కూటీని తగులబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆందులో రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి మరీ దాని యజమాని షోరూం ముందే బైక్‌ను సుత్తితో పగలగొట్టాడు.
Ola शोरूम ने 90000 का बनाया बिल, ग्राहक ने परेशान होकर शोरूम के सामने ही तोड़ दी स्कूटी !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) November 23, 2024
सोशल मीडिया पर वायरल हुआ वीडियो !!#ola #OlaScooter #viralvideo #ViralVideos #socialmedia #Nedricknews @OlaElectric #Trending #TrendingNews pic.twitter.com/dKovcCQxbO
స్కూటీని బాగు చేయించడానికి ఇప్పటివరకు 90 వేల వరకు ఖర్చు చేశానని, అయినా సరే మరోసారి రిపేర్ కు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై షోరూం యజమాన్యం నుంచి సరైన స్పందన లేదని, అందుకే ఈ విధంగా నిరసన తెలుపుతున్నానని చెప్పాడు. తాను పగలకొట్టడమే కాకుండా చుట్టూ గుమికూడిన వ్యక్తిని కూడా పిలిచి మరీ తన బండిని బద్దలు కొట్టొచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఈ ఘటనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. తాము కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్నామని కొందరు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications