8ఏళ్ల గర్ల్‌కు టీచర్ లైంగిక వేధింపు, మరోచోట టీచర్ పైన
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో మరో చిన్నారి లైంగిక వేధింపులకు గురయింది. 63 ఏళ్ల ఓ స్కూల్ టీచర్ ఎనిమిదేళ్ల బాలికను సెక్సువల్‌గా వేధించాడు. దీనిపై బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు.
నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తాళగట్టపుర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సదరు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని పలుమార్లు పాఠశాలలోని ఫస్ట్ ఫ్లోర్‌కు తీసుకు వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట.

టీచర్ పైన టీచర్...
బెంగళూరులో గెస్ట్ టీచర్‌గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి టీచర్ ను అరెస్టు చేశారు. మరో ఘటనలో అరాచకాల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దుండగులు టీచర్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications