మరో విమానంలో 250 మంది.. బుఖారెస్ట్ నుంచి బయల్దేరిన ప్లేన్

ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 219 మంది ముంబై చేరుకోగా.. మరో విమానం బయల్దేరింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. రెండో విమానం రుమేనియా రాజధాని బుఖారెస్ట్ నుంచి బయల్దేరింది. ఆ విమానంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులను సరిహద్దుల వద్దకు తరలించి రుమేనియా మీదుగా భారత్ తరలిస్తున్నారు.

Recommended Video

    Russia Ukraine Conflict : భారత పౌరులకు, విద్యార్థులకు Indian Embassy కీలక సూచన!| Oneindia Telugu
     another Flight Carrying 250 Indian students Evacuated From bucharest

    తొలుత 219 మందితో రొమానియా నుంచి బయల్దేరిన విమానం ముంబై రీచ్ అయ్యింది. ఉక్రెయిన్ గగనతలంపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి వారంతా రొమానియా కాలి నడకన/ వాహనాల్లో చేరుకున్న సంగతి తెలిసిందే. ముంబై వచ్చిన వారికి మేయర్ కిశోర్ పండెకర్ స్వాగతం పలికారు. వారంతా తమ పిల్లలు అని చెప్పారు. వారు ఎక్కడికి వెళ్లేందుకు అయినా ఓకే అని.. కానీ పరీక్ష చేయడం, వ్యాక్సినేషన్, ఆహారం ఇతర అన్నీ ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. భారత్ చేరుకున్న వారందరికీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘన స్వాగతం పలికారు.

    ఇటు ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారు. నిన్న 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ వర్సిటీలో మెడిసన్ చేస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో స్వదేశం చేరడానికి ఇబ్బందులు తప్పడం లేదు. భారత విద్యార్థులను వర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చింది. పోలెండ్ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టింది. ఆపై వారందరూ సరిహద్దు వద్దకు కాలినడకన చేరుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+