ఉన్నావ్ దారుణం: అన్నా అనింది.. ప్రాధేయపడింది... అయినా కనికరించని కామాంధులు

Recommended Video

    9 ఏళ్ళ చిన్నారి పై అఘాయిత్యం

    అన్నా నన్ను వదిలేయండి.. నన్ను ఏమి చేయకండి... అని వేడుకుంది. ప్రాధేయపడింది. అయినా కొంచెం కూడా జాలి కరుణా చూపలేదు ఆ కామాంధులు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాల్పడటమే కాదు ఆ ఘటనను వీడియో రికార్డింగ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే... ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

    గంగాఘాట్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఇంట్లో ఉండగా నలుగురు దుండగులు ప్రవేశించి ఆమెనే సమీపంలోని అడవికి తీసుకొచ్చారు. తనను వదిలేయాల్సిందిగా వారి కాళ్లపై ప్రాధేయపడినప్పటికీ వారు కనికరించలేదు సరికదా... ఆమెను చెప్పులతో కొట్టారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు ఈ రేప్ ఘటనను వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తామని బెదిరించారు. ఈ ఘారానికి పాల్పడే సమయంలో దుండగులు వారి మొహాలను కూడా కప్పుకోలేదంటే ఎంతకు తెగించారో అర్థమవుతోంది.

    Another rape Incident in Unnao questions security of Women

    ముగ్గురు లైంగికంగా అమ్మాయిపై దాడి చేయగా నాలుగో వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డ్ చేశారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఘటనతో సంబంధమున్న రాహుల్, ఆకాష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీడియో ఎక్కడి నుంచి అప్‌లోడ్ అయ్యిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    అత్యాచారాలకు క్రైమ్‌లకు ఉత్తర్ ప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గత నెలలో ఉన్నావ్‌లోనే ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై పాతికేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే అదే జిల్లాలో మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఏప్రిల్‌లో 16 ఏళ్ల అమ్మాయి తనపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తే సీఎం యోగి నివాసం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తొమ్మిది నెలలుగా బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా అమ్మాయి తండ్రిని చితకబాదడంతో కొన్నిరోజులుకు ఆయన మృతిచెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవడంతో బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+