Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడులో ఏపీ ఫార్మలా.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా విజయ్!

తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 2026 ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో పీకే, విజయ్‌తో భేటీ కావడం, కొన్ని కీలక సూచనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయ్‌కి పీకే ఇచ్చిన సూచనలు ఇవేనా?
శాశ్వత ఓటు బ్యాంకు కలిగిన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటేనే డీఎంకేను నిలువరించడం సాధ్యమని విజయ్‌కు పీకే సూచించినట్లు సమాచారం. అన్నాడీఎంకేకు కనీసం 25 శాతం ఓట్లు ఉండగా, టీవీకేకు 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీలను కలుపుకుంటే మొత్తం 50 శాతం ఓట్లు సాధించవచ్చని పీకే అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఉదాహరణగా చూపించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని విజయం సాధించిన విషయాన్ని పీకే.. విజయ్‌కు గుర్తు చేసినట్లు సమాచారం. ఉమ్మడి శత్రువును ఓడించడానికి పొత్తులు ఎంత ముఖ్యమో ఆయన వివరించినట్లు తెలుస్తోంది.

AP formula in Tamil Nadu politics Palaniswami as Chief Minister Vijay as Deputy CM

ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి, విజయ్ ఉప ముఖ్యమంత్రి:
పళనిసామిని ముఖ్యమంత్రిగా, విజయ్‌ను ఉప ముఖ్యమంత్రిగా అంగీకరించే సూత్రాన్ని కూడా పీకే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో విజయ్ ఇంకా సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ, డీఎంకే తమ శత్రువు అని.. వాడిని ఓడించేందుకు తమతో కలిసి వచ్చే పార్టీతలో పొత్తు పెట్టుకుంటామని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.

టీవీకే శ్రేణుల ఉత్సాహం
ప్రశాంత్ కిషోర్ సూచనలతో టీవీకే శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ద్వారా అధికారం చేపట్టేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారం, నిర్వహణ బాధ్యతలను ఆదవ్‌ అర్జున్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. పీకే, ఆదవ్‌ అర్జున్ సూచనలను తప్పకుండా పాటిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు.

విజయ్ ఆలోచనలు ఏంటి?
2026లో పొత్తు ప్రభుత్వానికి అంగీకరించినా, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి శత్రువును ఓడించేందుకు కొన్ని రాజీలు చేసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే, విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ సలహాలు, టీవీకే శ్రేణుల ఉత్సాహం, విజయ్ తీసుకునే నిర్ణయాలు అన్నీ కలిసి తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+