AP-TS weather: అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కాగా, ఇప్పటికే వాతావరణంలో కాస్త చల్లబడింది. గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, మిర్చి రైతులు పంట నీటమునగడంతో వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట.. నీటిపాలు కావడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఏపీలోనూ సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications