AP-TS Weather: రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు, ఈదురుగాలులు

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ అధికారులు చెప్పారు.

తెలంగాణలో మరో మూడ్రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు

తెలంగాణలో మరో మూడ్రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్సాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి రాష్ట్రం నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని సంచాలకులు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు పడగా, వికారాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

ఏపీలోనూ ముడురోజులపాటు వర్షాలు, ఉరుములుమెరుపులు

ఏపీలోనూ ముడురోజులపాటు వర్షాలు, ఉరుములుమెరుపులు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని కారణంగా వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దేశంలోనూ భిన్న వాతావరణ పరిస్థితులు

దేశంలోనూ భిన్న వాతావరణ పరిస్థితులు

కాగా, ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకాల్, కర్ణాటక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశంలోని భిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఎండలు కొనసాగుతున్నాయి. దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+