భారతీయులకు ఆ దేశం శుభవార్త: అమెరికా వీసాతో నేరుగా ప్రవేశం!
విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అర్జెంటీనా ఒక గొప్ప శుభవార్తను అందించింది. ఈ దేశానికి వెళ్లడానికి ఇకపై ప్రత్యేక వీసా అవసరం లేదు. కానీ ఓ ముఖ్యమైన షరతు ఉంది. చెల్లుబాటులో ఉన్న అమెరికా టూరిస్ట్ వీసా ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు, అర్జెంటీనా వీసా కోసం దరఖాస్తూ చేసుకోకుండానే ఆ దేశంలో ప్రయాణించవచ్చు. ఈ కీలక నిర్ణయం అర్జెంటీనాలో పర్యాటకాన్ని గణనీయంగా పెంచుతుందని, తద్వార ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు.
వీసా నిబంధనలు సులభతరం: అర్జెంటీనా రాయబారి ప్రకటన
భారతదేశంలోని అర్జెంటీనా రాయబారి మరియానో కౌసినో (Mariano Caucino) ఈ కీలక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "అమెరికా వీసా ఉన్న భారతీయ పౌరులకు అర్జెంటీనాలో ప్రవేశాన్ని సులభతరం చేశాం" అని ఆయన పేర్కొన్నారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన ఈ తీర్మానం ప్రకారం, అమెరికా టూరిస్ట్ వీసా ఉన్న భారతీయ పౌరులు ఇకపై అర్జెంటీనాకు ప్రత్యేక వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం అర్జెంటీనా, భారత్ రెండింటికీ శుభవార్త అని, తమ దేశంలో మరింత మంది భారతీయ పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ నిర్ణయంతో ప్రయోజనాలు
అర్జెంటీనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పర్యాటకులకు వీసా ప్రక్రియ సులభతరం కావడంతో అర్జెంటీనాకు వచ్చే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎక్కువ మంది పర్యాటకులు రావడం వల్ల అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థకు ఆదాయం లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల భారత్, అర్జెంటీనా దేశాల మధ్య సంబంధాలు కూడా బలోపేతం కానున్నాయి. ఈ కొత్త నిబంధనతో అమెరికా వీసా ఉన్న భారతీయులు అర్జెంటీనా అందాలను సులభంగా ఆస్వాదించవచ్చు
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications