దారుణం... స్నేహితుడి భార్యపై ఆర్మీ కల్నల్ అత్యాచారం.. పార్టీకి పిలిచి అఘాయిత్యం..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఆర్మీలో కల్నల్ స్థాయి అధికారి ఒకరు స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న ఆ అధికారికి ఇటీవల కల్నల్‌గా పదోన్నతి లభించడంతో స్నేహితుడికి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో అతనికి మత్తు మందు ఇచ్చిన కల్నల్... అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాన్పూర్‌లోని ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రష్యాకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్న అతను పదేళ్లుగా ఆమెతో కలిసి ఇండియాలో ఉంటున్నాడు. తన స్నేహితుడైన లెఫ్టినెంట్ కల్నల్ అధికారి ఒకరికి ఇటీవల కల్నల్‌గా పదోన్నతి లభించడంతో కాన్పూర్‌లోని ఆఫీసర్స్ మెస్‌లో పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి అతనితో పాటు అతని భార్యను కూడా కల్నల్ ఆహ్వానించాడు. దీంతో ఇద్దరు కలిసి శనివారం(డిసెంబర్ 12) రాత్రి ఆ పార్టీకి వెళ్లారు.

పార్టీలో స్నేహితుడికి ఇచ్చిన డ్రింక్‌లో కల్నల్ మత్తు పదార్థం కలిపాడు. స్నేహితుడు అపస్మారక స్థితిలోకి జారుకున్నాక అతని భార్యపై అత్యాచారం చేశాడు. శనివారం రోజు జరిగిన ఈ ఘటనపై ఆదివారం(డిసెంబర్ 13) బాధితుడు కాన్పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు కల్నల్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Recommended Video
తన భార్య ప్రతిఘటించినప్పటికీ ఆమెపై దాడి చేసి మరీ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడు వెల్లడించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్.. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications