సహాయకుడిపై అసహజ లైంగికచర్య: బ్రిగేడియర్ ఘోరం
న్యూఢిల్లీ: బ్రిగేడియల్ స్థాయి సైనికాధికారి ఒకరు తన సహాయకుడి పైన అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను సెలవు పైన వెళ్లాల్సిందిగా పై అధికారులు ఆదేశించారు.
కీలకమైన కాశ్మీర్‌లోని వాస్తవాధీనరేఖ వద్ద విధులు నిర్వహించే అధికారి సాటి పురుషుడి పైన ఇలాంటి అసహజమైన శృంగారానికి పాల్పడటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారులకు సాధారణంగా సహాయకులను తప్పనిసరిగా ఇస్తారు.

ఈ బ్రిగేడియర్ విషయంలోను అదే జరిగింది. అయితే, ఆయన తన సహాయకుడి పైన అసహజమైన లైంగిక చర్యకు పాల్పడటంతో.. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం పైన దర్యాఫ్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications