తేజ్‌పాల్ రెండో అత్యాచారం!: అరుంధతి ఫైర్, సిఎం కూడా

తేజ్‌పాల్ బాధితురాలు సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఈ-మెయిళ్లు, ఎస్ఎమ్ఎస్‌ల రూపంలో అన్యాయం గురించి వాపోవడం తప్ప తేజ్‌పాల్‌పై ఇంతవరకు ఆమె ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు దిశగానే ఆమె రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. తేజ్‌పాల్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేశారు.
గోవా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడాన్ని తేజ్‌పాల్ తప్పు పట్టారు. అలాగే కేసు బదిలీ కోరుతూ ట్రాన్సిట్ పిటిషన్ కూడా వేశారు.
తేజ్‌పాల్‌పై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మండిపడ్డారు. ఆమె అంగీకారంతోనే అలా ప్రవర్తించినట్టు వాదించడంపై నిప్పులు చెరిగారు. ఆ నాలుగు నిమిషాలు అదీ లిఫ్ట్‌లో అతడు ఏమి చేసి ఉంటారనేది ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతోందని తీవ్రస్వరంతో అన్నారు. ఆరునెలల పాటు ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తేజ్‌పాల్ ప్రకటించడాన్నికూడా తప్పుబట్డారు. దానర్థం నేరం చేసినట్టు అంగీకరించడమేనని, ఆరు నెలలు సన్యాసం పొంది తిరిగి పత్రిక బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పడం దురదృష్టకరమని విమర్శించారు.
కాగా, ఈ కేసులో హాలీవుడ్ నటుడు, గాడ్‌ఫాదర్-2 ఫేమ్ రాబర్ట్ డినీరోని గోవా పోలీసులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన గోవా హోటల్‌లో డినీరో బస చేశారు.












Click it and Unblock the Notifications