ఢిల్లీ ఫలితాలకు ముందే బీజేపీకి షాకిచ్చిన కేజ్రివాల్ ?
ఢిల్లీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెల్లడికాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రయోగించిన ఓ అస్త్రం బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా బీజేపీ మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్దితి. దీంతో ఆ పార్టీ ఇప్పుడు కేజ్రివాల్ కు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరిస్తోంది.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగినట్లు తేల్చేశాయి. అలాగే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని కూడా చెప్పేశాయి. దీంతో కాస్త డీలా పడ్డ ఆప్ అధినేత కేజ్రివాల్.. తిరిగి కౌంటింగ్ రోజు కల్లా పుంజుకోవాలని భావించారో లేక క్షేత్రస్ధాయిలో వాస్తవపరిస్ధితుల ఆధారంగా మాట్లాడారో తెలియదు కానీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో 16 మంది ఆప్ అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ ఇచ్చిందంటూ కేజ్రివాల్ బాంబు పేల్చారు. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఇదో సంచలనంగా మారింది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే హస్తినలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో బీజేపీ అప్రమత్తమై ఆప్ అభ్యర్ధులతో టచ్ లోకి వెళ్లిందన్న చర్చ మొదలైంది. దీనికి మరింత మసాలా జోడించి కేజ్రివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.
కేజ్రివాల్ ఆరోపణలతో ఫలితాలకు ముందే ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ.. ఆయన ఈ ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే కేజ్రివాల్ మాత్రం అన్నీ తెలిసే పక్కాగా ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేపు ఆప్ గెలిచినా, ఓడిపోయినా, ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ వల్లే అని చెప్పుకునే అవకాశం ఆయనకు లభిస్తోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications